హైదరాబాద్
పంజాగుట్ట పీఎస్‌ను సందర్శించిన పంజాబ్ అధికారులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఖైరతాబాద్: జాతీయ స్థాయిలో రెండవ ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు పొందిన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ను పంజాబ్ రాష్ట్ర క్యాడర్‌కు ఐపీఎస్ అధికారులు సందర్శించారు. గురువారం ఐపీఎస్ అధికారులు హరీష్, సుధార్ విజీల బృందం స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్ అడ్మిన్ ఎస్‌ఐ శ్రీకాంత్ పోలీస్‌స్టేషన్‌లో అందిస్తున్న పౌర సేవలను వివరించారు. 5ఎస్ విధానంతో కేసుల నిర్వహణ, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. సీసీ కెమెరాల ఏర్పాటు వాటి ప్రాముఖ్యతలను వివరించారు. ప్రజలతో మమేకమై ఉత్తమమైన సేవలు అందిస్తున్న విధానాలను తెలియజేశారు. అనంరతం స్టేషన్ సిబ్బంది ఆరోగ్య అభివృద్ధికి ఏర్పాటు చేసిన జిమ్, పీస్ సెంటర్ల గురించి తెలిపారు.
ప్రశంసా పత్రాల అందజేత
ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి పశ్చిమ మండలం ఇన్‌చార్జి డీసీపీ సమతి ప్రశంసా పత్రాలు అందజేశారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న శ్యామల, ఈ-కాప్స్ ఆపరేటర్ మహేష్ కుమార్, సెక్షన్ ఇన్‌చార్జి రాఘవేంద్ర చారి, రిసెప్షనిస్ట్ రమేష్ కుమార్ ప్రశంసా పత్రాలు అందుకున్నారు.