హైదరాబాద్

గణేష్ విగ్రహాలకు సహజ రంగులు తప్పని సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయకుడి విగ్రహాలకు సహజ రంగులను వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, జిహెచ్‌ఎంసిని హైకోర్టు ఆదేశించింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. విగ్రహం తయారు చేసే వారి షాపులను జిహెచ్‌ఎంసి అధికారులు సందర్శించాలని కోర్టు పేర్కొంది. కృత్రిమ రంగులను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జిహెచ్‌ఎంసి విగ్రహాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై ఆ సంస్ధ తరఫున న్యాయవాది కేశవరావు కోర్టుకు వివరించారు. సహజరంగుల వినియోగానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది మహేందర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితితో కలిసి పనిచేయాలని, 15 అడగుల కంటే తక్కువగా విగ్రహాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు కోరింది. ఈ కేసు విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేశారు.