హైదరాబాద్

గురువులను గౌరవించడం సంప్రదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు సంస్కృతిలో గురువులను గౌరవించుకోవవాడం సంప్రదాయమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ అన్నారు. రాష్టత్రి అవార్డు గ్రహీత కంభంమెట్టు చెన్న కేశవ రావు జన్మదినోత్సవం సందర్భంగా ‘గురువందన’ మహోత్సవ కార్యక్రమం కమలాకర చారిటబుట్ ట్రస్ట్, కమలాకర లలిత కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జస్టిస్ చల్లా కోదండరామ్ పాల్గొని వివిధ రంగాల్లో ప్రముఖులు సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ విజయ బాబు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా.కేవీ కృష్ణకుమారి, ధర్మ ప్రచారకుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రముఖ చారిత్రక నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌కు ‘జీనవ సోపన’ విజేత పురస్కారాలను ప్రదానం చేశారు. సామాజిక స్పృహతో యువత ఎదిగి భావితరాలకు ఉత్తమ సమాజాన్ని అందించాలని సూచించారు. కమలాకర చారిటబుల్ ట్రస్ట్ అనేక సేవ కార్యక్రమాలతో పాటు విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ నృత్య గురువుశృతకీర్తి శిష్య బృందం ప్రదర్శించిన ‘సుషుమ్మ’ నృత్య రూపక ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో డా.ఎస్.ఆవులప్ప, సాహితీవేత్త చిక్కా రామదాసు, మంతెన కాలేజ్ సెక్రటరీ మారుతి, బరోడా బ్యాంక్ మేనేజర్ రాజేష్, సంస్థ అధ్యక్షురాలు లయినెస్ భారతీ కమలాకర్ పాల్గొన్నారు.