హైదరాబాద్

‘జాం’ఝాటమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: భాగ్యనగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం, పర్యావరణం హితం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రోరైలు ప్రాజెక్టు కారణంగా రద్దీ జంక్షన్లలో మున్ముందు ట్రాఫిక్ జాం తీవ్ర రూపం దాల్చే అవకాశాలున్నాయి. మెట్రోరైలు పనులు ప్రారంభం కాకముందు నుంచే నగరంలోని వివిధ ప్రధాన, రద్దీ జంక్షన్లలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు జిహెచ్‌ఎంసి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే! అయితే జిహెచ్‌ఎంసి, నగర ట్రాఫిక్ పోలీసుశాఖ, మెట్రోరైలు శాఖల మధ్య ప్రతిపాదనల స్థాయిలో తలెత్తిన సమన్వయలోపం మున్ముందు జంక్షన్ల అభివృద్ధికి సవాలుగా మారింది. ఖైరతాబాద్, ఉప్పల్, హబ్సిగూడ, పంజాగుట్ట, ఆర్టీసి క్రాస్‌రోడ్డువంటి జంక్షన్లలో మెట్రోరైలు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కొన్ని జంక్షన్ల మధ్యలో పిల్లర్లు వస్తూ, మరికొన్ని జంక్షన్లలో స్టేషన్లను ఏర్పాటు చేయటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ స్థితిలో చేయగలిగే ప్రత్యామ్నాయాలేమీ లేవు. నగరంలో నిత్యం రద్ధీగా ఉండే పలు రహదార్లలో మెట్రో కారిడార్ నిర్మాణం కారణంగా ఇప్పటికే మూడంచెల రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. రోడ్డుపై, అలాగే ఫ్లైఓవర్ దానిపై నిర్మించిన మెట్రో కారిడార్ ద్వారా మూడు రకాలుగా నగరవాసులు ప్రయాణించేందుకు వీలు ఏర్పడింది. ఈ రకంగా త్రిబుల్ ట్రావెలింగ్ అవకాశం మెట్టుగూడ, పంజాగుట్ట చౌరస్తా, నారాయణగూడ చౌరస్తా, సికిందరాబాద్ ఓలిఫెంటా బ్రిడ్జి, నల్గొండ క్రాస్‌రోడ్డు వంటి జంక్షన్ల పాటు మరికొన్ని ప్రాంతాల్లో మూడురకాలుగా ప్రయాణించే రవాణా వ్యవస్థ ఏర్పడింది.
8మీటర్ల లోపు తవ్వకాలు జరిపితే..
అంతేగాక, మెట్రో పిల్లర్ల చుట్టూ ఎనిమిది మీటర్ల విస్తీర్ణంలో మున్ముందు ఎలాంటి తవ్వకాలు జరపరాదని, ఒక వేళ జరిపితే రేపు మెట్రోరైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కారిడార్‌పై రైలు పరుగుల కారణంగా, దాని వైబ్రేషన్ పిల్లర్లపై పడి, ఊహించని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలున్నట్లు పలువురు ఇంజనీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగోల్ నుంచి శిల్పారామం వరకు నిర్మించనున్న కారిడార్ 3తో పాటు ఎల్బీనగర్, మియాపూర్ కారిడార్ 1లోని పలు రద్దీ జంక్షన్లలో నేషనల్ హైవే నిర్మించతలపెట్టిన ఎనిమిది ఫ్లై ఓవర్ల ప్రతిపాదనలకు పైన పేర్కొన్న కారణాలు అడ్డంకులుగా మారాయి. నగరంలో మొత్తం 98 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదార్లలో ఎనిమిది ఫ్లై ఓవర్ల ఏర్పాటుకు డిపిఆర్ తయారు చేయటం, మెట్రో కారిడార్ నిర్మించని కొన్ని ప్రాంతాలు ఎన్‌హెచ్ పరిధిలోకి వస్తుండటంతో ఈ ఫ్లై ఓవర్లను నిర్మించేందుకు ఆ శాఖ వెనకడుగు వేస్తోంది.
ఎస్‌ఆర్‌డిపికి మెట్రో అడ్డంకి
నగరంలో ఎలాంటి అడ్డంకులు, సిగ్నల్స్ గానీ లేకుండా ట్రాఫిక్ మరింత శరవేగంగా ముందుకు కదిలేందుకు వీలుగా ప్రభుత్వం స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి)ని రూపొందించిన సంగతి తెలిసిందే! ఇందుకు సంబంధించి మరికొద్దిరోజుల్లో పనులు కూడా ప్రారంభించేందుకు జిహెచ్‌ఎంసి సన్నాహాలు చేస్తోంది. కానీ పలు చోట్ల మెట్రోరైలు ప్రాజెక్టు ఈ పనులకు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా కెబిఆర్ పార్కు, మైండ్ స్పేస్ జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే కెబిఆర్ పార్కు నుంచి మెట్రోరైలు వెళ్లింది. దీంతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్దనున్న జంక్షన్‌ను అభివృద్ధి చేయాలంటే సమస్యలు ఎదురుకానున్నాయి. మెట్రో పిల్లర్ల చుట్టూ ఎనిమిది మీటర్ల బయటే పిల్లర్లు ఏర్పాటుకు తవ్వకాలు జరపాల్సి ఉంది. ఇలా చేయాలనుకుంటే స్థల సేకరణ పెద్ద మరో ప్రధాన సమస్యగా మారనుంది. లేదని 8 మీటర్ల లోపు తవ్వకాలు జరిపితే మెట్రో పునాదులు దెబ్బతినే అవకాశాలున్నాయి. కారణంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో నిర్మించాలని భావిస్తున్న మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్‌కు ప్రస్తుతం భావించిన దాన్ని కన్నా ఎక్కువ స్థల సేకరణ చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద జిహెచ్‌ఎంసి అండర్ పాస్ నిర్మాణ చేయనుంది. ఈ జంక్షన్ వద్ద నుంచే మెట్రోకారిడార్ వెళ్తుంది. దీంతో ఆ ప్రాంతంలో అండర్‌పాస్ నిర్మాణం కోసం తవ్వకాలు ముందుగా జరిపి, ఆ తర్వాత మెట్రో కారిడార్‌ను నిర్మాంచుకోవల్సి ఉంటుంది. ఆ తర్వాత అండర్‌పాస్ పూర్తి చేసుకోవల్సి ఉంటుంది. మెట్రో నిర్మాణం తర్వాత తవ్వకాలు జరిపితే కారిడార్ పునాదులకు ముప్పు వాటిల్లే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.