హైదరాబాద్

నిఘా నేస్తాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: నగరంలో నిత్యం రద్ధీగా ఉండే కూడళ్లు, చౌరస్తాలతో పాటు వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్‌లలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు పోలీసులకు నేస్తాలుగా మారాయి. ఎక్కడ ఏ నేరం జరిగినా, నిందితులను గుర్తించేందుకు ఈ సిసి కెమెరాల ఫుటేజీలు ఉపయోగపడుతున్నాయి. 2013 ప్రజాభద్రత చట్టం కింద తొలుత వీటిని రాజధాని దిల్లీలో అమలు చేసిన తర్వాత ఇతర నగరాలకు విస్తరించారు. అప్పట్లోనే దిల్లీ నగరంలో లక్షా 79వేల సిసి కెమెరాలను అమర్చారు. అయితే ప్రజాభద్రత చట్టం ప్రకారం ప్రతి వంద మంది జనాభా ఉండే ప్రాంతానికి ఒక సిసి కెమెరాలను అమర్చాల్సి ఉంది. కానీ కోటి జనాభా ఉన్న మన నగరంలో లక్ష సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు గతంలో జిహెచ్‌ఎంసి, నగర పోలీసు శాఖలు సంయుక్తంగా ప్రకటనలు చేసినా, నేటికీ పూర్తి స్థాయిలో సమకూరలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించకముందే నగరంలో లక్ష సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనను సిద్ధం చేసినా, కొద్దిరోజుల క్రితమే నిధులు మంజూరైన సంగతి తెలిసిందే! ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టారు. అయితే కమ్యూనిటీ, కాలనీ సిసి కెమెరాలతో సహా వ్యాపార సముదాయాలు తప్పనిసరిగా వీటిని ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దిల్లీ స్థాయిలో ఇక్కడ సిసి కెమెరాలు అందుబాటులో లేకపోయినా, ఇప్పటి వరకు నగరంలో సంచలనం సృష్టించిన ఎన్నో నేరాలు, ఘోరాలకు సంబంధించి కీలకమైన ఫుటేజీలు, నిందితుల ఆనవాళ్లను అందించి, నిందితులు పట్టుబడేందుకు ఈ సిసి కెమెరాలు కారణమయ్యాయి. ప్రజాభద్రత చట్టం అమల్లోకి రాకముందు కేవలం బడా వ్యాపార సంస్థలు, కార్పొరేటర్ కార్యాలయాలకే పరిమితమైన ఈ సిసి కెమెరాలు ఇపుడు నగరంలో ఎక్కడ చూసినా, చిన్నాచితక దుకాణాల్లో దర్శనమిస్తున్నాయి. దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటన మొదలుకుని కొద్దిరోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాతబస్తీకి చెందిన అభయ్ అనే చిన్నారి కిడ్నాప్ కేసుకు సంబంధించి ఎంతో కీలకమైన ఫుటేజీలను ఈ కెమెరాలను అందించాయి. సికిందరాబాద్ ఆల్ఫా హోటల్ సమీపంలోని సిసి కెమెరా అందించిన ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకోగలిగారు. అంతేగాక, నిందితులకు కోర్టుల్లో శిక్షపడే కీలకమైన ఆధారాలు, సాక్ష్యాలను కూడా ఈ ఫుటేజీ ద్వారానే సమకూరుతోంది. ఏడాది కాలంలో పోలీసులు సుమారు 250 కేసులను సిసి ఫుటేజీతోనే ఆధారంతోనే చేధించినట్లు సమాచారం. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ప్రైవేటు దుకాణం నుంచి పోలీసులు ఫుటేజీని సేకరించిన నేపథ్యంలో నగరంలో ఈ కెమెరాలు ఏర్పాటు చేయటం తప్పనిసరి అన్న నిర్ణయానికి దారి తీసింది. ఆ తర్వాతే నగరంలోని చిన్నాచితక దుకాణాలు కూడా వీటిని ఏర్పాటు చేసుకునే దిశగా ఆసక్తి చూపాయి.
ఉల్లం‘ఘను’ల గుర్తింపు
భాగ్యనగర్‌లో నిత్యం రద్దీగా ఉండే పలు రహదార్లు, కూడళ్లలో అసలు ఉందో, లేదో కూడా తెలియని స్థాయిలో అమర్చబడే ఈ సిసి కెమెరా కేవలం నేరాలకు, ఘోరాలు, ప్రమాదాలకు సంబంధించిందే గాక, పోలీసులకు రెవెన్యూ సమకూర్చే మరో వనరుగా ఉపయోగపడుతోంది. రద్దీగా ఉండే ప్రతి కూడలి వద్ద ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారుల ఫొటోలను సేకరించటంతో పాటు వారు ఏ రకంగా ఉల్లంఘించారో కూడా కళ్లకద్దినట్టు చిత్రాలను పంపుతూ ఈ చలాన్ విధానాన్ని పటిష్టంగా అమలు పరిచేందుకు పోలీసులకు చక్కటి నేస్తాలుగా మారాయి.
ఎన్నో రకాలుగా వినియోగం
కేవలం రోడ్డుపైనో, చౌరస్తాల్లో, కూడళ్లలోనో, ఏటిఎంలలో జరిగే నేరాలు ఘోరాలే గాక, సిసి కెమెరాలను మరింత చక్కటి నైపుణ్యత కల్గిన సిబ్బందిని సమకూర్చుకుంటే ఆల్ ఇన్ వన్‌గా వినియోగించుకోవచ్చునని అధికారులంటున్నారు. నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి ఎన్ని రకాల చర్యలు చేపట్టినా, ఆశించిన స్థాయిలో ఫలితం రావటం లేదు. దీంతో ఓపెన్ ప్లేస్‌లలో చెత్త వేసేవారిని గుర్తించి, జరిమానాలు వసూలు చేసేందుకు గాను నగరంలోని 1116 ప్రాంతాల్లోని సిసి కెమెరాల ఫుటేజీ కారణంగా బాధ్యులను గుర్తించేందుకు జిహెచ్‌ఎంసి సిద్ధమైంది.