హైదరాబాద్

ఎయిడ్స్ నివారణలో అందరూ భాగస్వాములవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎయిడ్స్ మహమ్మారిని సమాజం నుంచి తరిమేసేందుక ప్రతి ఒక్కరూ నిర్మూలన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జే.రవి అన్నారు. బుధవారం జరిగిన వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపకుండా తగిన సహాయం అందించాలని సూచించారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బారిన పడిన వారికి తగిన చికిత్స తీసుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. జిల్లా వైద్యారోగ్యాధికారి డా.జే.వెంకట్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ స్థితి, ఎయిడ్స్ డే కార్యక్రమాల గురించి వివరించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.శశికళా రెడ్డి, డీసీహెచ్‌ఎస్ డా.నాగభూషణం, డీటీసీఓ చల్లాదేవి, అదనపు డీఎంహెచ్‌ఓ డా.నిర్మలా ప్రభావతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాన్యా నాయక్ పాల్గొన్న కార్యక్రమంలో జిల్లాలో ప్రతిభావంతులైన పలువురిని సత్కరించారు.