హైదరాబాద్

నిర్భయ నిధులతో మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో ప్రతిరోజు వృత్తి, విద్యా, ఉద్యోగంతో పాటు ఇతర అవసరాల కోసం రాకపోకలు సాగించే మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నగరంలో జనసంచారం ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ‘షీ టాయిలెట్ల’ ప్రయత్నం విఫలం కావటంతో, ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేకించి మహిళల కోసం, మహిళలే నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. పీపీపీ ప్రాతిపదికన పలు చోట్ల షీ టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చినా, వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడం, ఒక్కో యూనిట్‌లో టాయిలెట్ ఏర్పాటు 30 శాతం భాగాన్ని, మిగిలిన 70 శాతాన్ని వ్యాపారాల కోసం వినియోగించటం, కొన్నింటిలో వ్యాపార లావాదేవీలను పురుషులు చూసుకుంటున్నందున మహిళల రావటం లేదనే విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. నగరంలో మహిళల భద్రత, రక్షణతో పాటు వారికి వౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్భయ నిధులను మంజూరు చేసిందని, ఇందులో 70 శాతం నిధులను నగరంలో మహిళల కోసం టాయిలెట్ల ఏర్పాటుకు వినియోగించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇపుడు నగరంలోని మెయిన్ రోడ్లకిరువైపులా, మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో, పార్కులు, రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల వద్ధ వీటిని ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయనున్న ఈ టాయిలెట్లలో ఒక్కో యూనిట్‌లో 70 శాతం స్థలాన్ని టాయిలెట్ వినియోగం కోసం, మిగిలిన 30 శాతాన్ని మాత్రమే కమర్షియల్‌కు వినియోగించాలని, అందులో మహిళలు ఉపయోగించే వస్తువులతో కాఫీ, టీ, కూల్‌డ్రింక్ వంటివి అందుబాటులో ఉంచేలా నిబంధన విధించాలని బల్దియా భావిస్తోందని పేర్కొన్నారు. వీటిని నూటికి నూరు శాతం మహిళలే నిర్వహించాచేలా చర్యలు తీసుకోనున్నట్లు మేయర్ తెలిపారు. నగరంలోని స్వయం సహాయక బృందాల్లో ఒక్కో బృందానికి ఒక ఏడాది పాటు వీటి బాధ్యతలను అప్పగించాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు.