హైదరాబాద్

నిమ్స్‌లో దోపిడీకి గురౌతున్న ఆరోగ్యశ్రీ రోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 3: ఇరు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే పేరెన్నిక గాంచిన నిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగులు దోపిడీకి గురౌతున్నారు. కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చుకే అందిస్తున్నట్టు నిత్యం చెప్పుకునే నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ రోగులు నరకాన్ని చవిచూస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించే సదుద్దేశంతో తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం అమలులో నిమ్స్ యాజమాన్యం అలసత్వం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నిమ్స్ ఆసుపత్రిలో ఓపి సేవలను ఉచితంగా అందించడంతో పాటు వైద్యపరీక్షలపై 25శాతం రాయితీ ఇచ్చేవారు. ఈ తరహా విధానం వల్ల కడుపేదరికంలో మగ్గే వారు వైద్యపరీక్షలు చేయించుకోలేక పోతున్నారన్న విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఆరోగ్యశ్రీ రోగులకు అన్ని రకాల వైద్యసేవలను ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం అందడం లేదని రోగులు, వారి సహాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వైద్య పరీక్షలను ఆరోగ్యశ్రీలో చేస్తున్నా, సిటి స్కాన్, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలకు డబ్బులు వసూలు చేస్తున్నారని, నిబంధనల గురించి మాట్లాడితే నెలల తరబడి సాచివేతకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా నిమ్స్‌లో తగినన్ని వైద్యపరికరాలు లేవన్న కారణాన్ని సాకుగా చూపుతూ రోగులను వారి సహాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ రోగులు ఓపి కార్డు పొందడం నుంచి వైద్యం చేయించుకొని బయటకు వెళ్లే వరకు అడుగడుగుగా సిబ్బంది చీదరింపులకు గురౌతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ఆపరేషన్‌కు మూడు నుంచి ఆరు నెలలు కాలం పడుతుండటంతో రోగులు వారితో వచ్చిన వారు నరకాన్ని చవిచూస్తున్నారు. అసలే ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న వారు నెలల తరబడి నిమ్స్‌లో ఉండాల్సిన దుస్థితి ఉండటంతో మరింత ఆర్ధిక కుంగుబాటుకు గురౌతున్నారు. ఆరోగ్యశ్రీ రికార్డులను సక్రమంగా సమర్పించకపోవడంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి నిమ్స్‌కు రావాల్సిన సుమారు 17 కోట్లు ఆగిపోయాయి. ఆరోగ్యశ్రీ రోగులకు ఇబ్బందులు లేకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.