హైదరాబాద్

స్వచ్ఛ భారత్ సృష్టికర్త గాడ్గే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్వచ్ఛ భారత్ సృష్టికర్త గురుదేవుజి గాడ్గే బాబా జయంతిని రజక మహిళా సంఘం అధ్యక్షురాలు ఎం.రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. మెట్టుగూడ చౌరస్తాలో గాడ్గే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాజేశ్వరి మాట్లాడుతూ నిస్వార్థంగా, నిజాయితీగా సమాజ నిర్మాణానికి, విద్యా, ఆరోగ్యం, శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి యావత్ జీవితాన్ని సమాజ శ్రేయస్సుకు ధారబోసిన మహనీయుడు గాడ్గే బాబా అని కొనియాడారు. గాడ్గేను గురువుగా డా.బీఆర్ అంబేద్కర్ భావించారని గుర్తుచేశారు. సమస్త జాతుల్లో విద్యావ్యాప్తిని ఎన్నో పాఠశాలలను నెలకొల్పారని, మహారాష్టల్రో గాడ్గే పేరుతో యూనివర్సిటీ ఉందని చెప్పారు. గాడ్గే జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, భారతరత్న అవార్డు అందించాలని కోరారు. కార్యకమ్రంలో శ్రీనివాస్ వరలక్ష్మి, సంతోష్, లక్ష్మి, శ్రీధర్, నర్సింహులు, మహేష్, ధనలక్ష్మి పాల్గొన్నారు.