హైదరాబాద్

మానసిక రోగులకు ఉచిత సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, మే 5: మానసిక రుగ్మతలతో బాధపడే వారికి ఉచితంగా సేవలందిస్తామని ప్రముఖ సైకాలజిస్ట్, సోషల్‌వర్కర్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శక్తికి మించిన ఒత్తిడి తేవడంతో వారు మానసిక రుగ్మతలకు గురవుతున్నారని అలాంటి వారికి ఆకృతి స్వచ్ఛంద సంస్థ ఉచితంగా వైద్య సేవలందిస్తామని గురువారం చైతన్యపురిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తమ పిల్లవాడికి ముఖ్య సబ్జక్ట్‌లలో తక్కువ మార్కులు వచ్చాయని పక్క విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చాయని ఒత్తిడిని తేవడం లేక స్కూల్స్‌ను మార్చడం సరైన మార్గం కాదు. ముందు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. వయసుకు తగ్గట్లు మానసిక ఎదుగుదల, శారీరక మార్పులు ఉన్నాయో లేవో గుర్తించి వైద్యులకు చూపించాలన్నారు. తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని అందరి తల్లిదండ్రులకు ఉండటం సహజం. కానీ వారిపట్ల కొందరు తల్లిదండ్రులకే పూర్తిస్థాయి అవగాహన ఉందన్నారు. మానసిక రుగ్మతలతో బాధపడేవారు నగరంలో ఎక్కడున్నా తమను సంప్రదిస్తే వారికి ఉచితంగా వైద్యం నిర్వహించి రానుపోను చార్జీలు కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు.