హైదరాబాద్

బ్యాంకు రుణాలు పొందని రైతుల వివరాలు బ్యాంకర్లకు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: రబీలో పంటవేసి బ్యాంకు రుణాలు పొందని రైతుల వివరాలను బ్యాంకర్లకు అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో పంట రుమాల పై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర కరవు పరిస్థితులు నెలకొనడంతో రబీ సీజన్‌లో పంట సాగు తక్కువగా ఉందని 54 వేల హెక్టార్లకు 14,999 హెక్టార్లలో శనిగ, వేరుశెనగ పంటలు వేశారని అన్నారు. ఈ వేసిన రైతులందరికీ పంట రుణాలందించేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతుల పూర్తి వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తారని తెలిపారు. కూరగాయలు, పూలు ఇతర ఉద్యానవన పంటలు కొన్ని చోట్ల వేశారని వాటికి రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు చొరవ చూపాలని అన్నారు. అదేవిధంగా ఉద్యానవన శాఖ వారు కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటలు వేస్తున్న రైతుల వివరాలన్నీ గ్రామాల వారీగా లీడ్ బ్యాంకు మేనేజర్‌కు, బ్రాంచి మేనేజర్లకు అందజేయాలని ఆదేశించారు. బ్యాంకర్లు రుణాల రెన్యువల్, కొత్తగా రుణాలు ఇవ్వటంలో వెనుకబడి ఉన్నారని బ్యాంకర్లు తమ పనితీరును మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఖరీఫ్ సీజన్ 41 శాతం మాత్రమే రుణాలు రెన్యువల్‌ల్, కొత్త రుణాలు మంజూరు చేశారని అన్నారు. రబీలో పంటలు వేసిన రైతులందరికీ రుణాలు మంజూరు చేయాలని అన్నారు. 2016-17 రుణ ప్రణాళికపై జనవరి నెలలో సన్నాహక సమావేశం ఉంటుందని లీడ్ బ్యాంక్ మేనేజర్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు. బ్యాంకర్లు ఖరీఫ్ రుణాలు మంజూరు ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని సూచించారు. వ్యవసాయ పనులు జూన్‌లో ప్రారంభమవుతాయనగా మే నెల నుండే ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని అన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడి జగదీష్, ఇన్‌చార్జి ఎల్‌డిఎం నాగేశ్వర్‌రావు, ఉద్యానవన శాఖ డిడి బాబు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో
21న ‘శివానంద ఎమినెంట్
సిటిజన్ అవార్డుల’ ప్రదానం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 19: సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ సోమవారం రోజున 22వ వార్షిక ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డులు-2015’ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ కె. బసవరాజు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సికిందరాబాద్ టివోలీ గార్డెన్స్‌లో సాయంత్రం ఆరు గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి పాట్నా పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి ముఖ్య అతిధిగా, గౌరవ అతిధిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు హజరుకానున్నట్లు ఆయన తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవానికి ముందు ఆరుగంటల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి చేతుల మీదుగా వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన ఇద్దరికి ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు-2015’లను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులకు ఈ సారి సైంటిఫిక్, ఇండస్ట్రీయల్ రీసెర్చ్ సంస్థ పూర్వ డైరెక్టర్ జనరల్, పద్మ విభూషణ్ డా.ఆర్.ఏ. మశేల్కర్, అతి విశిష్ట సేవా మెడల్, పరమ విశిష్ట సేవా మెడల్‌లను స్వీకరించిన నేవీ వైస్ అడ్మిరల్ ఏ.ఆర్. టండన్‌లను ఎంపిక చేసినట్లు తెలిపారు. అవార్డును స్వీకరించనున్న వారిలో మశేల్కర్ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీకి అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. 20 శతాబ్దంలో లండన్‌లోని ఫెల్లో ఆఫ్ రాయల్ సైన్స్ ఇంజనీర్‌గా ఎంపికైన మూడో భారతీయుడు ఈయన 1991లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ పురస్కారాలను స్వీకరించారు. మరో అవార్డు గ్రహీత ఏ.ఆర్. టండన్. ఈయన భారత నేవీ సంస్థలో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండెంట్ ఇన్ చీఫ్‌గా వ్యవహారించి దేశభద్రత విషయంలో విశిష్టమైన సేవలందించిన వైస్ అడ్మిరల్ ఏ.ఆర్. టండన్‌ను సదరన్ నేవీ, వెస్టర్న్ నవీ సంస్థలకు నావల్ కమాండ్‌లకు వైస్ అడ్మిరల్‌గా ఆయన సేవలందించారు.