హైదరాబాద్

సమన్వయం పెంపునకు ప్రత్యేక వాట్సప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: మహానగరంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా, శాఖల మధ్య ఏర్పడే సమన్వయలోపాన్ని అధిగమించి, ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు ఏర్పాటైన సమన్వయ కమిటీ శనివారం సైబరాబాద్ కమిషనరేట్‌లో సమావేశమైంది. వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ నెలకొసారి ఒక్కో విభాగం కార్యాలయంలో సమావేశం కావాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా. బి. జనార్దన్ రెడ్డి సూచన మేరకు మే మాసానికి సంబంధించిన సమావేశం శనివారం జరిగింది. ఇందులో అధికారులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రానున్న వర్షాకాలం అయినందున, ఈ సారి వర్షాలు బాగా కురిసే అవకాశాలున్నట్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ అయినందున విపత్తుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండటంతో పాటు అన్ని విభాగాలతో చక్కటి సమన్వయాన్ని సమకూర్చుకోవాలన్నారు. ఇందుకు గాను ఎక్కడ ఏ సంఘటన జరిగినా, అన్ని విభాగాలకు చెందిన అధికారులకు అప్పటికపుడు సమాచారం చేరవేసేందుకు గాను ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు నగరంలోని నిత్యం రద్ధీగా ఉండే జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్‌కు సంబంధించి కూడా చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టుకు కావల్సిన స్థల సేకరణ, పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలపై అధికారులు చర్చించారు. దీంతో పాటు జిహెచ్‌ఎంసి రూపకల్పన చేసిన ‘ హైదరాబాద్ కనె్వర్జన్సీ పోర్టల్’ను వినియోగించి ఇతర విభాగాలకు చెందిన అధికారులు కూడా ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం వంటి చేపట్టేందుకు వీలుగా కల్గుతుందన్నారు. దీంతో పాటు నగరంలో పౌరసేవల నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలు, వర్షం, ట్రాఫిక్ సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు బల్క్ ఎస్‌ఎంఎస్ విషయాన్ని కూడా పరిశీలించారు. దీంతో పాటు జిహెచ్‌ఎంసి పరిధిలో స్మార్ట్ పార్కింగ్ ఎంతో అవసరమని, ఇందుకు వీలైనంత త్వరగా స్థలాలను గుర్తించాల్సిన అవసరముందని నిర్ణయించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ కమిషనర్ సి.వి. ఆనంద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రెవెన్యూ ఉన్నతాధికారులు, ట్రాఫిక్, సిపిడిసిఎల్, జలమండలి, నీటిపారుదల, ఆర్టీసి, మెట్రోరైలు ఇతర విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.