హైదరాబాద్

చర్లపల్లి కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, కుషాయిగూడ మే 8: చర్లపల్లి కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టించింది. జైలు సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా గుమ్మడిదళం గ్రామానికి చెందిన సెల్వరాజ్(45) హత్యకేసులో జీవిత ఖైదీగా చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున అతను తన బెడ్‌షీట్‌ను చింపి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో సంగారెడ్డి జిల్లా కారాగారంలో శిక్షను అనుభవిస్తున్న సెల్వరాజ్‌ను భద్రతా కారణాల రీత్యా చర్లపల్లి కేంద్ర కారగారానికి తరలించినట్టు జైలు అధికారులు తెలిపారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు జైలు అధికారులు తెలిపారు. ఈమేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ తెలిపారు.