హైదరాబాద్

నూజివీడులో నీటి ఎద్దడి రానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, మే 9: నూజివీడు పురపాలక సంఘం పరిధిలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చైర్‌పర్సన్ బసవ రేవతి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్యాంకర్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం ఉదయం చైర్‌పర్సన్ బసవ రేవతి అధ్యక్షతన జరిగింది. వివిధ అభివృద్ధి పనులకు చెందిన తీర్మానాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు కూళాయిల ద్వారా నీరు సరఫరా అయ్యే విధంగా చూడాలని కోరారు. ఈ విషయంపై చైర్‌పర్సన్ బసవ రేవతి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న నీటి సరఫరాతో పాటు నీటి సమస్య గుర్తించిన ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీరు నిత్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. అయిదు ట్యాంకర్లను ఏర్పాటు చేశామని అన్నారు. ముఖ్యంగా నీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా నీటి సరఫరా నిత్యం జరిగే విధంగా అధికారులకు సూచనలు ఇచ్చామని తెలిపారు. కౌన్సిలర్ ఇందుపల్లి సత్యప్రకాష్ మాట్లాడుతూ 24వ వార్డులో పలు సమస్యలు తిష్టవేసుకుని ఉన్నాయని, వీటిని పరిష్కరించాలని కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదని వాపోయారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోందని, దీనిని పరిష్కరించేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటుంటే పురపాలక శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమని ఆరోపించారు. పురపాలక సంఘం పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు చెందిన 23 అంశాలను కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.