హైదరాబాద్

ఆదాయం పెరిగేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: స్వపరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపకల్పన చేసిన విజన్‌ను అమలు చేస్తూ చేపట్టే అభివృద్ధి పనులకు భారీగా నిధులను వెచ్చించే అవకాశమున్నందున నిధుల సమీకరణ విషయంలో జిహెచ్‌ఎంసి అధికారులు కాస్త ముందస్తుగా కసరత్తు ప్రారంభించారు.
స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ కింద త్వరలో మల్టీలెవెల్ ప్లై ఓవర్లు, స్కైవాక్‌లు వంటివి నిర్మించే పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, వాటికి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉన్నందున, ఆ సమస్యను అధిగమించేందుకు ఇప్పటి నుంచే అధికారులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే వర్తమాన ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను బకాయిలను కాస్త ముందుగానే వసూలు చేసుకునేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు కొద్దిరోజుల క్రితం వరకు అయిదు శాతం రిబేటు, ఇపుడు మరో ‘ఆకర్ష్’ స్కీంను ప్రకటించిన సంగతి తెలిసిందే! ఆదాయ పెంపునకు ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సు వంటివి పెంచకుండానే జిహెచ్‌ఎంసికి ఉన్న ప్రధాన ఆస్తులను ఆదాయ మార్గాలుగా మలుచుకునేందుకు కమిషనర్ నేతృత్వంలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనికి తోడు జిహెచ్‌ఎంసి పరిధిలో ప్రస్తుతమున్న 53 పార్కింగ్ యార్డుల ద్వారా సంవత్సరానికి కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తోంది.
ఈ పార్కింగ్ యార్డుల ద్వారా కాంట్రాక్టర్లు మాత్రం వందల కోట్ల రూపాయలు జేబులు నింపుకుంటున్నట్లు కమిషనర్ గుర్తించారు. అయితే పార్కింగ్‌లలో ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టు విధానాన్ని పరిశీలించాలని, అవసరమైనన్ని మార్పులు చేయాలన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు.
రైతుబజార్ల నిర్వహణ అంశంలో కూడా మార్పులు తేవాలని యోచిస్తున్నారు. వీటిని వేలం వేసే సమయంలో కాంట్రాక్టర్లు రింగు అయ్యే విధానాన్ని నియంత్రించాలని భావిస్తున్నారు. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో ఉన్న కమ్యూనిటీ హాళ్లు చాలా వరకు రాజకీయ నాయకుల కబ్జాల్లో ఉన్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు, వాటిని సర్కిళ్ల స్థాయి డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోకి తీసుకురావాలని ఇప్పటికే కమిషనర్ ఆదేశించిన సంగతి తెలిసిందే! మున్ముందు వీటి నిర్వహణను స్థానిక స్వయం సహాయక బృందాలకు అప్పగించాలని, వీటి ద్వారా ఆదాయ పెంపుకు అందుబాటులో ఉన్న మార్గాలను అనే్వషించాలని భావిస్తున్నారు. అలాగే జిహెచ్‌ఎంసికి చెందిన పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, క్రీడామైదానాలు, శ్మశానవాటికలు, ఖాళీ స్థలాల వివరాలను జియోటాగింగ్ చేసి వెబ్‌సెట్‌లో అందుబాటులో ఉంచాలని ఇప్పటికే కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని 521 క్రీడామైదానాలు, 9 బ్యాడ్మింటన్ కోర్టులు, ప్రధాన క్రీడా కాంప్లెక్సులను అవసరమైతే క్రీడామైదానాలు, స్పోర్ట్ స్టేడియంలు స్కూళ్లకు గంటల వారీగా అద్దెకు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉంది. దీనికి తోడు జిహెచ్‌ఎంసి ప్రస్తుతం ప్రజలకు అందిస్తున్న సేవల నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని కూడా భావిస్తున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని కొన్ని కార్పొరేట్ సంస్థలకు పలు రకాల సేవలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంస్థలకే నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే తడి,పొడి చెత్తను వేర్వేరుగా బిన్లలో వేసే అంశంపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించేందుకు ఓ సంస్థ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే!