హైదరాబాద్

ఎలా ఉన్నారు.. ఏం కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: నిలువనీడలేని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు గత పాలకులు నిర్మించిన వాంబే, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్లను జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి బుధవారం పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 13 వేర్వేరు ప్రాంతాల్లో ఈ రెండు స్కీం ల కింద సుమారు 2వేల ఇళ్లను నిర్మించారు. వీటిలో దాదాపు 1920 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 1532 గృహాలను లబ్దిదారులకు కేటాయించగా, వీటిలో కేవలం 291 మంది మాత్రమే నివాసముంటున్నారు. లబ్దిదారులు తమ వంతు వాట చెల్లించకపోవటం, వౌలిత సదుపాయాల కల్పన పనులు పూర్తికాకపోవటం వంటి రకరకాల కారణాలున్నాయి. ఇతరత్ర సమస్యలతో మరో 1658 గృహాలు ఖాళీగా పడి ఉన్నాయి. దీంతో స్థానికంగా ఏ విధమైన సమస్యలు, వౌలిక సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలు తదితరంశాలను పరిశీలించేందుకు కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆయా గృహాల్లో నివాసముంటున్న వారిని బుధవారం కలిసి, ఇళ్లు..ఎలా ఉన్నాయి? మీరు బాగున్నారా? అంటూ ఎంతో ఆప్యాయతతో పలకరించారు. అంతేగాక, స్థానికంగా నెలకొన్న సమస్యలను కూడా అడిగి తెల్సుకున్నారు. పాటిగడ్డ, ఎన్‌బిటినగర్, కస్తూర్బానగర్, బన్సీలాల్‌పేట, ఉన్నికోట, పూల్‌బాగ్ తదితర బస్తీల్లోని కాలనీల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ కలెక్టర్‌తో చర్చించి మిగిలిన గృహాలను కూడా లబ్దిదారులకు కేటాయించేందుకు చర్యలు చేపడుతామని తెలిపారు.
ఈ కాలనీల్లో అంతర్గతంగా రహదారుల నిర్మాణం, ఇతర వౌలిక వసతుల కల్పన చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీటిలో నివాసం ఉండే మహిళలందరూ స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా చేరాలని, బ్యాంకు రుణాలును క్రమం తప్పకుండా చెల్లించాలని, ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని కమిషనర్ అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఈ కాలనీల్లో ఉండే యువకులతో యువజన సంఘాలు ఏర్పటు చేయించాలని సూచించారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో పార్కులు, క్రీడామైదానాలు వంటివి ఏర్పాటు చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. బన్సీలాల్‌పేట బండ మైసమ్మనగర్‌లోని వాంబే కాలనీలో మంచినీటి సమస్యపై మహిళలు కమిషనర్‌కు వివరించారు.
ఈ వాంబే కాలనీ నివాసితులకు రూ. 200కే నల్లా కనెక్షన్ ఇప్పించాలని జలమండలి అధికారులను కోరారు.
ఈ కాలనీల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అదికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ పర్యటనలో కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్ శివకుమార్ నాయుడు కూడా ఉన్నారు.