హైదరాబాద్

ఆకట్టుకుంటున్న తెలంగాణ సంస్కృతి కళారాధన ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న తెలంగాణ కళారాధన ఉత్సవాలు పలువురిని ఎంతాగానో ఆకట్టుకుంటున్నాయి. భాషా సంస్కృతిక, సమాచార, పర్యటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలను జిల్లాలవారీగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో తెలంగాణ కళారాధన ఉత్సవాలను నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన కళావేదికపై ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం ప్రారంభమైన వేడుకలు రాత్రి వరకు కొనసాగుతున్నాయి. కళాకారులను ప్రోత్సహించడంతో పాటు వివిధ కళారూపాలు అంతరించి పోకుండా జీవం పోసేందుకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఎన్నో కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ కళాకారుల ఉనికిని వెలుగులోకి తేవడం కోసం ఈ వేదికలు నిలుస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎంతో వైభవోపేతంగా జరుపుకునే బోనాలు, జాతర, పోతురాజుల నృత్యం, కూచిపుడి నృత్యం, డప్పువాయిద్యాలు, జానపద గేయాలు వంటి కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. మూడో రోజైన గురువారం సత్యం బృందం ప్రదర్శించిన జానపదగేయాలు, భారతమ్మ బృందం ప్రదర్శించిన శారద కథ, శ్రీనివాస్‌గౌడ్ బృందం నిర్వహించిన బతుకమ్మ రూపకం (లక్ష్మిదేవమ్మ), పులివేషాలు (శ్రావన్‌కుమార్), జానపద గేయాలు (సత్యం అండ్ పార్టీ) విశేషంగా అలరించాయి. వీటితో పాటు హరితహారం ఆంశంపై సంస్కృతిక సారథులు ప్రదర్శించిన గేయనాటకం కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై జరుగుతున్న కార్యక్రమాలను వీక్షించడానికి అనేక మంది తరలివస్తున్నారు.