హైదరాబాద్

పాతనేరస్తుల అరెస్టు చోరీ సొత్తు రికవరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మే 12: చోరీ చేసి అమ్మిన సెల్‌ఫోన్ నిందితులను పట్టిచ్చింది. ఇఎంఇఐ నెంబర్ ఆధారంగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన నిందితులకు అరదండాలు వేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న పాతనేరస్తులను చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి సొత్తును రికవరీ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగి కెఎస్ శ్రీరామ్ సీతాఫల్‌మండిలో ఓ అపార్టుమెంట్ కొత్తగా కొనుగోలు చేసి ఫిబ్రవరి 14న గృహప్రవేశం చేశారు. రాత్రి ఇంట్లోని వారు నిద్రిస్తున్న సమయంలో మాణికేశ్వర్‌నగర్‌లో నివాసం ఉండే పాతనేరస్తులు అయిన అన్నదమ్ములు ముద్దండ్ల నాగులు అలియాస్ మహేశ్ (25) మహేందర్ అలియాస్ లడ్డూ (21) లోపలకి దూరారు. ఇంట్లో ఉంచిన ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, 2 సెల్‌ఫోన్‌లు రు. 20వేలు అపహరించారు. శ్రీరామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు దొంగిలించిన సెల్‌ఫోన్‌ను ఇతరులకు అమ్మడం, సదరు వ్యక్తి సెల్‌ఫోన్‌ను వాడుతుండటంతో ఆ ఫోన్‌కు సంబంధించిన ఐఎంఈఈ నెంబర్ ఆధారంగా తీగను లాగితే డొంకంతా కదిలింది. నిందితుల ఇళ్ల వద్ద కాపుకాసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు దొంగిలించిన వస్తువులను అమ్మిపెట్టే మాణికేశ్వర్ నివాసి భూపతి (30) బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వ్యక్తులను విచారించిన పోలీసులు సొత్తును రికవరీ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. కేసును చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.