హైదరాబాద్

పాతబస్తీలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: నగరంలో పోలీసులు నిర్వహిస్తున్న నిర్బంధ తనిఖీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలోని ఐదు జోన్లలో నిర్వహిస్తున్న తనిఖీల్లో పాత నేరస్తులతోపాటు పలు నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. బస్తీలవారీగా నిర్వహిస్తున్న తనిఖీలు శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతో దోహదపడుతున్నాయి. గురువారం ఉదయం పాతబస్తీ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలోని వట్టెపల్లి ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. దక్షిణ మండలం డిసిపి వి.సత్యనారాయణ, ఫలక్‌నుమ, చార్మినార్ ఎసిపిలు ఎంఎ బారీ, అశోక్ చక్రవర్తితోపాటు పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు మొత్తం మూడు వందల మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, మూడు కార్లు, మూడు ఆటోలు, ఒక బోర్‌వెల్ లారీ, ఒక స్కూల్ బస్‌తోపాటు రెండు తల్వార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్బంధ తనిఖీల్లో పోలీసులకు పట్టుపడ్డ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.