హైదరాబాద్

ఇంటి తాళం పగులగొట్టి భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మే 16: ఇంటి తాళాలు పగులగొట్టి భారీ ఎత్తున బంగారు వెండి ఆభరణాలను దొంగిలించిన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరధిలోని పద్మారావునగర్‌లో చోటు చేసుకుంది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పద్మారావునగర్‌లో నివాసం ఉండే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి సుధీర్ విద్యుత్ కోత కారణంగా ఇంటికి తాళం వేసి శంషాబాద్‌లోని తన కూతురు ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. సోమవారం ఉదయం దాదాపు 11గంటల సమయంలో తిరిగి పద్మారావునగర్‌లోని తన నివాసానికి వచ్చాడు. ఇంటి తాళం తెరిచి ఉండడాన్ని గమనించి లోనికివెళ్లి చోడగా బీరువా తెలుపులు తెరిచి చిందర వందరగా ఉండడాన్ని గమనించాడు. దాచి ఉంచిన రెండు డైమండ్ నెక్లస్‌లు, నాలుగు చైన్‌లు, నాలుగు బ్రాస్‌లెట్‌లు రెండు మామూలు బంగారు చైన్‌లు, 18 ఉంగరాలు మొత్తం కలిపి 50 తులాల బంగారు ఆభరణాలు, ఐదుకిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులతోపాటు ఇతర ఉన్నతాధికారులు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసును నమోదు చేసుకుని చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.