హైదరాబాద్

ఈ దశాబ్దం జీవశాస్త్రానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మోలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) నూతన డైరెక్టర్‌గా డాక్టర్ రాకేశ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు శాస్త్ర సాంకేతిక, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సిఎస్‌ఐఆర్) నియామక ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఆయన సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సంస్థలో పనిచేస్తున్న పలువురు సీనియర్ శాస్తవ్రేత్తలు వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం సిసిఎంబిలో జరుగుతున్న పలు పరిశోధనలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన శాస్తవ్రేత్తలతో మాట్లాడుతూ ఈ దశాబ్దం జీవశాస్త్రానిదేనని వ్యాఖ్యానించారు.
అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ మిశ్రా ఎంఎస్సీ, పిహెచ్‌డి పట్టాలను పొందారు. కొంతకాలం బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పనిచేసిన మిశ్రా తర్వాత అమెరికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాల్లో పనిచేశారు. మిశ్రా 2001లో సిసిఎంబిలో సీనియర్ శాస్తవ్రేత్తగా చేరారు. సిసిఎంబి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలతో పాటు సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు శాస్తవ్రేత్తలు, పరిశోధకులు మరింత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.