హైదరాబాద్

మానవ మనుగడకు జీవవైవిధ్యాన్ని సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: జీవన వైవిద్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి మనిషి తన తెలివి తేటలు ఉపయోగించి మానవాళిని కాపాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కేవలం పుస్తకాల చదువుతో మార్పు రాదని, పంచభూతాలైన గాలి, నీరు, అగ్ని, భూమి, వృక్షాలు, పర్యావరణ కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం బిర్లా ప్లానిటోరియం భాస్కర ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి జోగు రామన్న ముఖ్యఅతిథిగా పాల్గొని ‘మన సీతాకోక చిలుకలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం వెనుకబడి ఉన్నామని, ప్రతి ఒక్కరూ జీవన వైవిద్యాన్ని సంరక్షించుకోవాలని అన్నా రు. ఐఎఫ్‌ఎస్ అధికారి రఘువీర్ మా ట్లాడుతూ 1992లో ప్రపంచ దేశాలు చేసిన తీర్మానంతో ప్రతి సంవత్సరం మే 22న జీవన వైవిద్య దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో టిఎస్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పికె శర్మ పాల్గొన్నారు. ఎంసి పర్గయిన్ స్వా గతం పలికారు. అంబడిపూడి మురళీకృష్ణ.. పర్యావరణం, జీవనవైవిద్యం గురించి తెలుపగా, బాలభవన్ విద్యార్థినులు కోలాట నృత్యం చేశారు.