హైదరాబాద్

రంగారెడ్డి జిల్లాలో నేడే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం పోలింగ్ జరగనుంది.
ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎమ్.రఘునందన్‌రావు తెలిపారు.ఐదు రెవిన్యు డివిజన్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో 771 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 424 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వికారాబాద్ డివిజన్‌లో 184, మల్కాజిగిరి డివిజన్‌లో 149, చేవెళ్ల డివిజన్ 173, రాజేంద్రనగర్ డివిజన్‌లో 48, సరూర్‌నగర్ డివిజన్‌లో అత్యధికంగా 217 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని ఓటర్లకు అనుకూలంగా ఉండేందుకు ఎక్కడికక్కడ రెవిన్యు డివిజనల్ పరిధిలో ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకోసం కీసర తహశిల్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లకోసం సరూర్‌నగర్ తహశిల్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లకోసం స్థానికంగా ఉన్న ఆర్‌డివో కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా తాండూరు, వికారాబాద్‌కు సంబంధించి వికారాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో, చేవెళ్ల, పరిగి నియోజకవర్గాలకు సంబంధించి చేవెళ్ల తహశిల్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ కోసం 24మంది పోలింగ్ అధికారులను నియమించినట్టు జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సైబరాబాద్ పరిధిలో 62మంది పోలీసు సిబ్బందితోపాటు మూడు మొబైల్ బృందాలు, నాలుగు ప్లాటూన్ల సాయుధదళాలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు నియమించారు. వికారాబాద్ ప్రాంతంలో 50మంది పోలీసు సిబ్బందితోపాటు రెండు మొబైల్ బృందాలు, ఎనిమిది ప్లాటూన్ల సాయుధ దళాలు ఎన్నికలను పర్యవేక్షించేందుకు నియమించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూమ్‌ను రాజేంద్రనగర్ ఆర్‌డివో కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు.
పోలింగ్ అనంతరం నివేదిక ఇవ్వండి
ఆదివారం నిర్వహించే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అనంతరం సమగ్ర నివేదికను అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక పరిశీలకులు శాంత్‌మన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఐదు పోలింగ్ కేంద్రాలకు నియమించిన సూక్ష్మ పరిశీలకులు ఎప్పటికప్పుడు ఎన్నికలప్రక్రియను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. శనివారం రాజేంద్రనగర్ ఆర్‌డివో కార్యాలయంలో సూక్ష్మ పరిశీలకులు, ఎన్నికల సిబ్బందితో పోలింగ్ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఎన్నికల విధానానికి సంబంధించిన ఫ్లెక్సీలను ఓటర్లకు కనిపించే విధంగా ప్రముఖంగా పోలింగ్ కేంద్రాల బయట ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పోలింగ్ అధికారులకు పంపిణీ చేసిన ఎన్నికల సామగ్రిని ఆయన పరిశీలించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి నియమించిన ప్రత్యేక పరిశీలకులు ఎమ్.జగదీశ్వర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి ఎన్నికల ప్రక్రియపై పోలింగ్ అధికారులకు పలు సూచనలు చేసారు.