హైదరాబాద్

తెలుగు సంస్కృతి చాటిచెప్పే ‘్భరతీయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: తెలుగువారు ఏ రాష్ట్రంలో వున్నా తెలుగు సంస్కృతి సంప్రదాయాలు మార్చిపోకుండా తలుగునేలపై కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నందులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కళారాధనలో భాగంగా సోమవారం సాయంత్రం రవీంద్రభారతి ఘంటసాల ప్రాంగణంలో మూడురోజుల ‘్భరతీయం’ కార్యక్రమాన్ని కెవి రమణాచారి ప్రారంభించారు.
వృత్తిరీత్యా ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళి 25 సంవత్సరాలు దాటినా తెలుగు భాషా సంస్కృతి మర్చిపోకుండా సంగీత నృత్యాలను నేర్చుకుని తెలుగు సంస్కృతిని గౌరవిస్తుంటే తెలుగు నేలపై వున్నమన ఇంట్లో పిల్లలు అమ్మా, నాన్న అని పిలవడానికి నామూషిపడి మమ్మి, డాడీ అని పిల్చుకునే స్థితిలో వున్నామని అన్నారు. పరభాష ప్రజలు తెలుగు భాషను గౌరవిస్తుంటే తెలుగు నేలపై ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నర్సరీ నుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే స్థితిలో వున్నామని ఆయన అన్నారు. ప్రతి తెలుగువాడు తెలుగుభాష అభివృద్ధి కోసం ఏం చేస్తున్నామని ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ఫ్యాషన్‌ల పేరుతో సంస్కృతిని మర్చిపోతున్నామని, సగం ప్యాంట్లు, అతుకుల చొక్కాలు వింత ఫ్యాషన్‌లో కొట్టుకుపోతున్న తెలుగువారికి ‘్భరతీయం’ జ్ఞానోదయం కావాలి. ఓట్లు కోసం రాజకీయ నాయకుల ప్రసంగాలు తెలుగును మర్చిపోయేలా చేస్తున్నాయని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి మూడురోజుల ముందు ‘్భరతీయం’ నిర్వహిస్తున్నందుకు సాస్కృతిక శాఖను రమణాచారి అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రేతర అతిధులు పివిపిసి ప్రసాద్, కె.రాంమోహన్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొనగా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షత వహించారు. చండిఘడ్ తెలుగు అసోసియేషన్ కళాకారులు గానం చేసిన త్యాగరాజ కీర్తనలు, గుజరాత్ కళాకారులు జానపద నృత్యాలు, మహారాష్ట్ర కళాకారులు ‘చీకట్లో చంద్రుడు’ హాస్యనాటిక, తమిళనాడు కళాకారులు శ్రీకృష్ణతులాభారం నాటకం ప్రేక్షకులను అలరించాయి.