హైదరాబాద్

పలుఅంశాలపై అమెరికాలోఅధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: పోలీసు శాఖలో మరిన్ని మార్పులు తెచ్చేందుకుగానూ స్టడీ టూర్‌పై విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన నగర కమిషనర్ మహేందర్ రెడ్డిని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం హైదరాబాద్ శాఖ ప్రతినిధులు సత్కరించి అభినందించారు. నగర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్‌రెడ్డి, నగర పోలీసు కో ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు పి.మాధవరెడ్డి, బి.అప్పల్‌సూరి, కోశాధికారి బి.శ్రీనివాసరెడ్డి, సభ్యులు ఎం.రఘురామరాజు, కె.జనార్దన్‌రెడ్డిలతో కూడిన బృందం సోమవారం బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో మహేందర్‌రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రాఫిక్, లాఅండ్ ఆర్డర్, సిసి కెమెరాల ఏర్పాటు, పెట్రోలింగ్ తదితర అంశాలపై అమెరికా తదితర ప్రాంతాల్లో చేసిన పర్యటన విజయవంతంగా ముగిసిందని, ఈ సందర్భంగా పలు అంశాలపై అధ్యయనం చేసినట్టు ఆయన వివరించారు.