హైదరాబాద్

రాష్ట్ర అవతరణ దినోత్సవాలకుఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో జూన్ 2న వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఆయా శాఖల అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా సక్రమంగా నిర్వర్తించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టరు రాహుల్ బొజ్జా ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో రాష్ట్ర అవతర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
జిల్లా అధికారులందరూ తమతమ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జెండావిష్కరణ, రక్తదాన కార్యక్రమాలకు హాజరు కావాలన్నారు. జిల్లాస్థాయి ఉత్సవాలకు ప్రోటోకాల్ ననుసరించి ఇన్విటేషన్ కార్డులను ముద్రించి సకాలంలో పంపిణీ చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలకు జిల్లా నుండి కో-ఆర్డినేట్ చేయాల్సిన వివిధ పనులలో ఆయా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు.
జిల్లాలోని వసతి గృహాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు స్వీట్ల పంపిణీతోపాటు ఆ రోజు వసతి గృహాలలో ప్రత్యేక భోజనం అందించాలని సాంఘిక సంక్షేమ శాఖ డిడి, బిసి, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు.
యుపిహెచ్‌ఎస్, డిసిహెచ్‌ఎస్‌లలో రోగులకు పండ్లు, పాలు, ప్రత్యేక ఆహారం పంపిణీకి మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీచేయాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు.
జూన్ 2న జిల్లాలో ఏర్పాటుచేస్తున్న మెగా హెల్త్ క్యాంపుల గురించి ఆయన ఆరా తీసారు. హెల్త్ క్యాంపుల ఏర్పాటు విషయమై ప్రజలకు తెలిసేలా పబ్లిసిటీ ఇవ్వాలని సూచించారు. అంగన్ వాడి కేంద్రాలో పిల్లలకు పండ్లు, స్వీట్లు, ప్రత్యేక ఆహారాన్ని అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్ర్తి శిశు సంక్షేమ శాఖ అధికారికి సూచించారు. జూన్2న సాయంత్రం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలందించిన జిల్లాలోని విశిష్ట వ్యక్తులకు ఈ సందర్భంగా జిల్లా స్థాయి అవార్డులను అందజేయడం జరుగుతుందని, అనంతరం వివిధ కళారూపాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సమాచార శాఖ అసిస్టెంటు డైరెక్టరు రమాదేవికి సూచించారు.
జిల్లా స్థాయిలో నిర్వహించేఅవతరణ దినోత్సవ వేడుకలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సవ్యంగా జరిగేలా అధికారులందరూ సమన్వయ సహకారాలతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమీక్షలో ఇన్‌చార్జి ఎజెసి అశోక్‌కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.