హైదరాబాద్

నగరంలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, మే 31: రోహిణీ కార్తెలో భగభగ మండుతున్న ఎండల్లోఅల్లాడుతున్న నగర ప్రజలకు మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ఉపశమనాన్ని కలిగించింది. ఉదయం నుండి ఉక్కబోత, వడగాల్పులతో కూడిన వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారింది. సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో ఓవైపు ఎండ కొడుతుండగానే చిరు జల్లుతో ప్రారంభమైన వర్షం ఒక్క సారిగా ఊపందుకుంది. సాయంత్రం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ముగిసే సమయంలో వర్షం ప్రారంభం కావటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులెదుర్కున్నారు. ట్యాంక్‌బండ్, లక్డీకాపూల్, నాంపల్లి, ఆబిడ్స్, ఆర్టీసి క్రాస్‌రోడ్ తదితర రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ ఏర్పడింది. కాగా వర్షం పలు ప్రాంతాల్లోపాక్షికంగా మరికొన్ని ప్రాంతాలలో భారీగా కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, తితదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.