హైదరాబాద్

దతన్న సెల్ దొంగ దొరికాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: ఏకంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మొబైల్ ఫోనునే కాజేసిన ఘనుడు పట్టుబడ్డాడు. ఈ నెల 15వ తేదీన ఉదయం సరూర్‌నగర్‌కు చెందిన గుమ్మడి రాజ్‌కుమార్ శ్రీశైలం దేవస్థానం మల్లన్న దైవదర్శనానికి సిఫార్సు లేఖ కోసం కేంద్ర మంత్రి దత్తాత్రేయ నివాసానికి వచ్చాడు. నగరంలో గాలి వాన బాధితులు తమ గోడు వినిపించుకునేందుకు దత్తాత్రేయ నివాసానికి రావడంతో ఇళ్ళంతా సందడిగా ఉంది. దత్తాత్రేయ మొబైల్ ఫోన్‌లో ఛార్జింగ్ తక్కువగా ఉండడంతో మంత్రి పర్సనల్ అసిస్టెంట్ ఆ ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టారు. అక్కడే ఉన్న రాజ్‌కుమార్ ఆ ఫోన్‌ను కాజేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు వ్యక్తిని మంగళవారం పట్టుకున్నారు.