హైదరాబాద్

‘హనుమాన్ చాలీసా’ సీడీ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, మే 31: హనుమన్ జయంతి వేడుకలు శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి గానసభలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు డా.కెవి.రమణచారి పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు చింతలపాటి సురేష్ గానామృతం చేసిన ‘హనుమాన్ చాలీసా’ సీడీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం రమణాచారి మాట్లాడుతూ హనుమన్ చాలీసాను చదవడం ద్వారా అన్ని శుభపరిణామలు కలుగుతాయని తెలిపారు. చింతలపాటి సురేష్ ఆలపించిన హనుమాన్ చాలీసా గానం ఎంతో అద్భుతంగా అలపించారని కొనియాడారు.
అనంతరం నరసింహం బృందంచే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భక్తులకు తీర్థాప్రసాదలను అందజేశారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళావేంకట దీక్షితులు, గానసభ ప్రధాన కార్యదర్శి కళాశారద, దైవజ్ఞశర్మ పాల్గొన్నారు.