హైదరాబాద్

ముద్రగడను విమర్శించే అర్హత ఏపి మంత్రులకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 31: ముద్రగడను విమర్శించే అర్హత ఏపి మంత్రులకు లేదని కాపు యువసేన మండిపడింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో యువసేన నాయకులు కర్ణా శ్రీనివాస్, రాఘవరావుమాట్లాడుతూ ఎన్నికల ముందు టిడిపి అధినేత ఇచ్చిన హామీని నెరవేర్చమని ముద్రగడ అడగడం తప్పా అని ప్రశ్నించారు. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసినందుకు మంత్రులు గంటా శ్రీనివాసరావు, చిన్నరాజప్ప, పి.నారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాపు జాతి కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ముద్రగడను విమర్శించే అర్హత మంత్రులకు ఎక్కడిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను బిసిల్లో చేర్చే అంశంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన ముంజునాథ్ కమిషన్ ఇంత వరకు పని ప్రారంభించని విషయం కాపు మంత్రులకు తెలియదా అని నిలదీశారు. అధినేత మెప్పుకోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాపుల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. మంత్రులకు చిత్తశుద్ది ఉంటే కాపులను బిసిల్లో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.