హైదరాబాద్

అంకితభావంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర ద్వితీయ ఆవిర్భవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సుదర్ఘీ పోరాటాల అనంతరం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటి హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ శ్రేణి నగరంగా రూపొందించటంలో మరింత చిత్తశుద్ధితో అభివృద్ధి, పారిశుద్ధ్యం కార్యక్రమాల నిర్వహణను చేపట్టాలని కోరారు. 44లక్షల డస్ట్‌బిన్లు, రెండు వేల ఆటో టిప్పర్ల ప పిణీ, ఈ-ఆఫీసు తదితర విప్లవాత్మక నిర్ణయాల ద్వారా రదేశంలోని కార్పొరేటర్లలో జిహెచ్‌ఎంసి ఓ ప్రత్యేకత సాధించుకుందని వివరించారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ మాట్లాడుతూ కెసిఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేయాలన్నారు. అనంతరం కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ విభిన్న కులాలు, మతాలకు చెందిన పౌరులు, వివిధ దేశాలకు చెందిన వారు నివసిస్తున్న హైదరాబాద్ నగరంలో పౌరసేవలు మరింత సమర్థవంతంగా అందించినపుడే తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి ఇనుమడిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు, అభివృద్ధి చేసేందుకు అదనపు పనిని చేయాలని కోరారు. కొత్త రాష్ట్రంలో ప్రజలకు మరింత మెరుగైన పాలనను అందించటాన్ని సవాలుగా తీసుకుని పనిచేయాలన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఉత్తమ నగరాలకు ధీటుగా ఎదుగుతోందని, ఈ ఆఫీసు అమలు చేస్తున్న అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా జిహెచ్‌ఎంసి ఇప్పటికే పేరుగాంచిందని ఆయన వివరించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆన్‌లైన్ విధానంలో భవన నిర్మాణ అనుమతులను అందజేసే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవమైన గురువారం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ఇది దేశంలోనే విప్లవాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిహెచ్‌ఎంసిలో ఉత్తమ సేవలందించిన ఐటి విభాగం ఇంజనీర్ నర్సింగ్‌రావుకు రూ. పదివేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసపత్రాన్ని మేయర్, కమిషనర్, డిప్యూటీ మేయర్ అందించారు. అలాగే ఆస్తిపన్ను వసూళ్లను మెరుగుపర్చుకునేందుకు ఇటీవల మే మాసం చివరి మూడురోజులు పన్ను చెల్లించిన బకాయిదారులకు నిర్వహించిన లాటరీలో రూ. లక్ష బంపర్ బహుమతిని పొందిన మల్కాజ్‌గిరికి చెందిన జి. బాపిరెడ్డికి కూడా వారు నగదు బహుమతిని అందజేశారు.
మా బాధ్యత నిర్వర్తిస్తాం!
బంగారు తెలంగాణ సాధనలో తమవంతు బాధ్యతలు నిర్వర్తిస్తామని జిహెచ్‌ఎంసి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం స్పష్టం చేసింది. ఇటీవల ఎన్నికైన కార్యవర్గం ఈ మేరకు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎ. దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా తాను ఎన్నిక కావటంతో పాటు ఉపాధ్యక్షులుగా డి. శ్రవణసాగర్, బి. శ్రీకాంత్‌రెడ్డి, ఎస్. హన్మంతరావులు ఎన్నిక కాగా, కార్యదర్శిగా ఆర్. హన్మంతుసాగర్, సంయుక్తకార్యదర్శులుగా జి. శ్రీనివాస్, ఎన్. కృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా సయ్యద్ అలీ అబ్బాస్, ఎస్. రమేష్. కోశాధికారిగా మహ్మద్ నిజాముద్ధిన్‌లు ఎన్నికైనట్లు ఆయన వివరించారు.