హైదరాబాద్

అమరవీరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అమరులైన కుటుంబాలను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించిందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జిల్లాలో 33మంది తమ ప్రాణాలను అర్పించారని అందులో నుండి 25 కుటుంబాలకు చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను నేడు అందిస్తున్నామని తెలిపారు. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించుకుని వాటి అమలుకు మనమందరం కృషి చేద్దామని మంత్రి అన్నారు. జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మిషన్ కాకతీయ కార్యక్రమం కింద జిల్లాలో మొదటి విడతలో 560 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టామని, రెండవ విడతలో 204 కోట్ల రూపాయలతో మరో 562 చెరువుల్లో పనులు జరుగుతున్నాయని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. మిషన్ భగీరథ కార్యక్రమం కింద అన్ని నివాస ప్రాంతాలకు మంచినీటిని అందించేందుకు వీలుగా 1960 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు మంత్రి పేర్కొంటూ ఈనెలాఖరు నాటికి మేడ్చల్ పరిధిలోని 104 నివాస ప్రాంతాలకు వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించనున్నట్టు మంత్రి వివరించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలో 6,850 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆసరా పథకం కింద 2 లక్షల 97 వేల మంది పెన్షన్‌దారులకు ప్రతి నెలా 34 కోట్ల రూపాయలను అందిస్తున్నామని, రూపాయికే కిలో బియ్యం పథకం కింద 11 లక్షల 44 వేల కుటుంబాలకు ఒక్కోక్కరికి 6 కిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం కింద 3,287 మంది ఎస్సీలకు, షాదీముబారక్ కింద 5,377 మంది మైనారిటీ యువతులకు 51 వేల రూపాయల చొప్పున 44 కోట్ల 17 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించామని మంత్రి అన్నారు. భూపంపిణీ పథకం కింద 41 మంది ఎస్సీ లబ్ధిదారులకు 114 ఎకరాల భూమిని పంపిణీ చేశామని, 50 యూనిట్లలోపు విద్యుత్ వాడే 18,285 మంది ఎస్సీ లబ్ధిదారులకు గత సంవత్సరం కోటి 56 లక్షల రూపాయలు చెల్లించామని, ఈ సంవత్సరం 68 లక్షల 47 వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి చెప్పారు. గత సంవత్సరం 23 వేల మహిళా సంఘాలకు 406 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలను అందించామని ఈ సంవత్సరం 342 కోట్ల రూపాయల రుణాలను అందించనున్నట్లు వివరించారు. పంట రుణాల కింద 730 కోట్ల రూపాయలను రైతులకు అందించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన 25మందికి నగదు పురస్కారంతో పాటు శాలువా, మెమొంటోలతో మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు 21.25 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కును మంత్రి అందజేశారు. అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా మూడు చక్రాల వాహనాలు, ల్యాప్ ట్యాప్‌లను పంపిణీ చేశారు. భూపంపిణీ పథకం కింద 3 ఎకరాల చొప్పున పట్టాపాస్ పుస్తకాలను ఎస్సీ లబ్ధిదారులకు అందించారు. అదేవిధంగా దీపం పథకం కింద లబ్ధిదారులకు దీపం గ్యాస్ కలెక్షన్‌ల పత్రాలను మంత్రి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.