హైదరాబాద్

కనుల విందుగా ఆవిర్భావ పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: ఉద్యమాల ఖిల్ల నల్గొండ జిల్లా..తెలంగాణ ఉద్యమ పరవళ్లు ఓరుగల్లు..కళల ఊరు పాలమూరుతో పాటు తెలంగాణలోని పదిజిల్లాలకు విభిన్న కళా, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గురువారం నగరంలో ఘనంగా జరిగాయి. అమరవీరుల ఆత్మబలిదానాలతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం మరోసారి రాజకీయపార్టీలకతీతంగా అమరులను స్మరించుకుంది. గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో, సాంస్కృతిక వేదికల్లో ఘనంగా జరిగాయి. గత సంత్సరంతో పోల్చితే ఈ సారి అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వేర్వేరుగా సంబరాలు జరగటంతో పాటు వివిధ సాంస్కృతిక, కళాంశాల్లో పోటీలు అనేక చోట్ల అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు జరిగాయి. గతంలో కేవలం వినాయక నిమజ్జనానికి మాత్రమే సాగర తీరం జనంతో కళకళాలాడేది. కానీ రాష్ట్ర రెండో అవతరణ దినోత్సవాల కారణంగా గురువారం ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిశాయి. జంటనగరాల నుంచే గాక, ఈ సారి పొరుగు జిల్లాలకు చెందిన ప్రజలు కూడా సంబరాలను వీక్షించేందుకు తరలిరావటం విశేషం. తెలంగాణ ప్రభుత్వం ఈ సారి ప్రాంతీయ అభిమానాన్ని చాటుతూనే, దేశభక్తిని సైతం చాటిచెప్పే విధంగా సాగర తీరాన సంజీవయ్యపార్కులో 300 అడుగుల ఎత్తుపై ఏర్పాటు చేసిన జాతీయ జెండాను తిలకించేందుకు మధ్యాహ్నం తర్వాత పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. సాగర తీరాన ఈ త్రివర్ణ పతాకం ఎంతో ఆకర్షణీయంగా కన్పించటంతో జనం బూర్గుల రామకృష్ణారావు భవనం, జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయ భవనం, లుంబనీపార్కులోని హుస్సేన్‌సాగర తీరం వద్ధ నిలబడి ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన తెలంగాణ కార్నివల్ కార్యక్రమంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్‌తో ఆ ప్రాంతమంతా పట్టపగలును తలపించింది. సాయంత్రం ఏడు గంటలకు విభిన్న కళా ప్రదర్శనలు, ఊరేగింపులు, ఆకాశంలో రంగురంగుల టపాసుల వెలుగులు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ కళాకారులు రూపొందించిన గీతాలు ప్రతి ఒక్కర్ని స్టెప్పులు వేయించాయి. సంబరాల ప్రారంభానికి ముందే వేల సంఖ్యలో జనం ట్యాంక్‌బండ్‌పై చేరుకోవటంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై జరిగిన సంబరాలకు హాజరైన వారిలో చాలా మంది హుస్సేన్‌సాగర్ విద్యుత్ కాంతులను, లేజర్ షోను, విచిత్ర వేషధారణలో హజరైన కళాకారులతో తమ సెల్ ఫోన్లలో సెల్పీ ఫోటోలు తీసుకోవటం కన్పించింది. ఈ సారి సాగర తీరాన ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ జెండా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జెండా వద్ధ ఫొటోలు, సెల్ఫీల్లో మొత్తం జెండా రాకపోవటంతో పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలపైకి ఎక్కి జనం ఫొటోలు దిగటం కన్పించింది.
ఇండోర్ స్టేడియంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎల్‌బినగర్: తెలంగాణ ద్వితీయ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి హాజరై మొట్టమొదటగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులు నిర్వహించిన పరేడ్‌తో మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా అందరూ ఆశ్చర్య పోయే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయని అమరుల త్యాగం దేశ, రాష్ట్ర ప్రజలు మరువలేనిదని పేర్కొన్నారు. అనంతరం సరూర్‌నగర్, జిల్లెలగూడ, శంకర్‌పల్లిలకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, భాగ్యనగర్ డ్యాన్స్ స్కూల్‌లు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా ఉత్తమ వైద్యుడిగా డాక్టర్. ఎజికె గోఖలే, వ్యాపారవేత్తలుగా శ్రీ్ధర్‌రెడ్డి, ఖాజామహ్మద్ మొయినొద్దీన్, శాస్తవ్రేత్తగా ప్రొఫెసర్ వి.దశవంతరెడ్డి, సాహిత్యవేత్తగా వి.చెన్నయ్య, పెయింటర్‌గా డి.అనంతయ్య, నటుడిగా డాక్టర్.రామస్వామి, నృత్యకళాకారిణిగా జి.శ్రీదేవి, శిల్పి కళాకారిణిగా రోహిణిరెడ్డి, క్రీడాకారిణిగా ఎన్.సిక్కిరెడ్డి, క్రీడాకారుడిగా చల్ల పవన్‌కుమార్, న్యాయవాదిగా ఎ.పుల్లారెడ్డి, ఎన్‌జిఓగా కస్తూర్భాగాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్, సామాజిక కార్యకర్తగా నర నాగేశ్వర్‌రావు, ఉత్తమ మున్సిపాలిటీగా ఇబ్రహీంపట్నం, ఉత్తమ మండలంగా మంచాల్ మండలం, ఉత్తమ గ్రామపంచాయతీగా కందుకూరు మండలానికి చెందిన మురళీనగర్ గ్రామం, అర్చకుడిగా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన శ్రీలక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయ అర్చకుడు డి.లక్ష్మణచారి, ఇమామ్‌గా మఫ్‌టి మహ్మద్‌అబ్దుల్ ముక్తదిర్ రషీద్, వ్యవసాయదారుడిగా కందుకూరు మండలం నేదునూరు గ్రామానికి చెందిన గంగుల సురేందర్‌రెడ్డి, హార్టికల్చర్ వ్యవసాయదారుడిగా డోమ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన ఎల్.పెద్దిరాములు, ఉత్తమ జర్నలిస్టులుగా జాల రాధాకృష్ణ, ఎస్.జైపాల్‌రెడ్డి, ఉపాధ్యాయుడిగా తాండూరు యూపిఎస్‌కు చెందిన డి.శ్రీనివాస్, అంగన్‌వాడీ కార్యకర్తగా కుత్బుల్లాపూర్ అయోధ్యానగర్-1కు చెందిన ఎ.జీతమ్మలకు మంత్రి మహేందర్‌రెడ్డి శాలువాతో సత్కరించి రూ.51వేల చెక్కు, మెమొంటోతో సత్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన 25మంది అమరవీరుల కుటుంబాలకు సన్మానం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. వీరిలో మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన మందడి యాదిరెడ్డి, సరూర్‌నగర్ మండలం ఎల్‌బినగర్‌కు చెందిన సిరిపురం శ్రీకాంత్, మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన సిరిపురం యాదయ్య, మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌కు చెందిన అరిగె సరిత, కేతిరెడ్డి మండలంకు చెందిన జనె్న మహేశ్, చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామానికి చెందిన మంగలి జంగయ్య, వికారాబాద్ మండలం మదనాపల్లి గ్రామానికి చెందిన సొప్పరి యాదయ్య, మారెపల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన బి.్భరత్‌కుమార్, మేడ్చల్‌కు చెందిన పట్నం శ్రీకాంత్, దుర్వాస్ కిషోర్‌సింగ్, దగ్గు సురేష్, లింగంపల్లికి చెందిన నెల్లూరి లక్ష్మణ్, ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలన్ గ్రామానికి చెందిన కాకి కుమార్, కూకట్‌పల్లికి చెందిన గుడి రాజిరెడ్డి, ఘన్‌పూర్‌కు చెందిన ఖానాపురం మేశక్, కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన గొర్ల మల్లేష్ యాదవ్, పేట్‌బషీరాబాద్‌కు చెందిన గట్టు సంజీవరావు, ఉప్పల్‌కు చెందిన ధమ్‌శెట్టి సాయినాథ్, నాచారానికి చెందిన జి.రాము, మన్సూరాబాద్‌కు చెందిన అనె్నలి శేఖర్‌రెడ్డి, జగద్గిరిగుట్టకు చెందిన పర్వతం నవీన్‌చారి, సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడకు చెందిన వేముల రామశర్మ, శామీర్‌పేట్‌కు చెందిన గిరిపల్లి నర్సయ్య, హబ్సిగూడకు చెందిన బుక్య మోహన్, కుత్బుల్లాపూర్‌కు చెందిన జాఫర్‌ఖాన్‌ల కుటుంబాలకు సత్కారం చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ నియామకపు పత్రాన్ని అందజేశారు. అంధులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ, వికలాంగులకు త్రిచక్రవాహనాలను పంపిణీ చేశారు. అనంతరం వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎస్పీ, సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, కలెక్టర్ రఘునందన్‌రావు, జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి, ఎల్‌బినగర్ డిసిపి తస్వీర్ ఇక్బాల్, ఎసిపి వేణుగోపాల్‌రావు, సరూర్‌నగర్ మండల డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికార యంత్రాంగంతో పాటు భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
ఉత్తమ జర్నలిస్టు గా జాల రాధాకృష్ణ
తెలంగాణ ద్వితీయ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఉత్తమ జర్నలిస్టుగా ఆంధ్రభూమి ప్రతినిధి జాల రాధాకృష్ణ మంత్రి మహేందర్‌రెడ్డి నుంచి అవార్డు అందుకున్నారు. నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన జాల రాధాకృష్ణ 1993లో ఆంధ్రభూమి తెలుగు దినపత్రికలో హయత్‌నగర్ మండల విలేఖరిగా చేరి 1998నుండి జిల్లా ప్రతినిధిగా నేటి వరకు విధులు నిర్వహిస్తున్నారు. ఆనాటి నుండి అన్యాక్రాంతమవుతున్నప్రభుత్వ భూములు, భూ ఆక్రమణలపై ప్రత్యేక కథనాలు, కబ్జాదారులపై చర్యలు తీసుకునే విధంగా, మరెన్నో సమస్యలపై రాశారు.