హైదరాబాద్

ఎస్‌ఆర్‌డిపికి గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: జంటనగరవాసులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన విభాగాధిపతులకు తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) ప్రాజెక్టు పనులకు ఆదిలోనే అనేక రకాలుగా అడ్డంకులేర్పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద ఈ నెల మొదటి వారంలోనే కెబిఆర్ పార్కు మల్టీలేవెల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు పనులను చేజిక్కించుకున్న సంస్థలు సిద్ధంగా ఉన్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ముఖ్యంగా స్థల సేకరణ పూర్తి కాకపోవటం ఓ కారణం కాగా, అభివృద్ది, మల్టీలేవెల్ ఫ్లైఓవర్లు, స్కైవాక్‌ల పేరిట జూబ్లీహిల్స్ కెబిఆర్ పార్కు చుట్టూ వందలాది చెట్లను నరికివేయటం పట్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! అంతేగాక, చెట్ట నరికివేతకు సంబంధించి స్టే కూడా జారీ చేయటంతో పాటు కెబిఆర్ పార్కు చుట్టూ ఎన్ని తొలగించాల్సి వస్తోంది? ఇందులో అయిదు అడుగుల ఎత్తు కల్గిన చెట్లు ఎన్ని ఉన్నాయి? వాటి స్థానంలో ఇతర చెట్లను ఏమైనా నాటుతున్నారా? అన్న అంశంపై జిహెచ్‌ఎంసి అధికారులు అధ్యయనం చేసిన నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. దీంతో అధికారులు అధ్యయనానికి ముందు, అధ్యయనం తర్వాత ట్రిబ్యునల్‌కు సమర్పించిన నివేదికల్లో చెట్ల సంఖ్య భారీగా మార్పు రావటంతో ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అంశంపై గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తొలుత ఇచ్చిన నివేదికలో సుమారు 13వందలకు పై చిలుకు చెట్లను తొలగించాల్సి వస్తుందని, ఆ తర్వాత ఇచ్చిన నివేదికలో కేవలం 1200 చెట్లను మాత్రమే తొలగిస్తున్నామని, వీటిని మరో చోట రి లోకేషన్ చేస్తామని జిహెచ్‌ఎంసి సమర్పించిన నివేదికపై ట్రిబ్యునల్ అసంతృత్తిగా ఉండటం వల్ల నిర్ణయంలో జాప్యం జరుగుతుందని చెప్పవచ్చు. మరోవైపేమో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, మైండ్ స్పేస్ చౌరస్తాల్లో మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కావల్సిన స్థలాలను ఇచ్చేందుకు యజమానుల ససేమిరా అంటున్నట్లు సమాచారం. బంగారం కన్నా రేటు పలికే గజం భూమి కూడా జిహెచ్‌ఎంసి అధికారులు సేకరించాలంటే బడాబులైన స్థల యజమానుల గొంతెమ్మ కోర్కేలను తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. నష్టపరిహారం కూడా కోట్లలో చెల్లించాల్సి వస్తున్నందున, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలంటూ జిహెచ్‌ఎంసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతేగాక, కెబిఆర్ పార్కు చుట్టు, మైండ్ స్పేస్ జంక్షన్‌తో, ఇతర మరో రెండు ప్రాంతాల్లో ఈ ఎస్‌ఆర్‌డిపి పనులను ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టు సంస్థలకు ప్రారంభించాల్సి ఉన్నా, నేటికీ ప్రారంభం కాలేదు. పనులు చేపట్టేందుకు తమకు ఆలస్యమవుతుందంటూ హైకోర్టు ఆశ్రయించాలన్న విషయాన్ని జిహెచ్‌ఎంసి అధికారులు పరిశీలిస్తున్నారు.