హైదరాబాద్

‘హూ కిల్డ్ స్వామి లక్ష్మానంద’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జూన్ 3: హూకిల్డ్ స్వామి లక్ష్మానంద పుస్తకావిష్కరణను ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరగోపాల్ మాట్లాడుతూ ఒడిసాలో 2008లో కంధమల్‌లో స్వామి లక్ష్మానంద హత్య జరిగిన తరువాత క్రిస్టియన్లపై ప్రతికారదాడులు జరిగాయని అన్నారు. ఈ హత్యాకాండలో వందలమంది క్రిస్టియన్లు బలైపోయారని అన్నారు. ఈ నేపథ్యంలో తానే ఆల్‌లైన్ పిటిషన్ వేసి ఖైదీల విడుదల కోసం ప్రయత్నం చేశానని గుర్తుచేశారు. ఈ సమావేశంలో రచయిత ఆంటోఅక్కర మాట్లాడుతూ కంధమల్‌లో క్రిస్టియన్లపై దాడులు, మహిళలు, చర్చిలపై దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. స్ర్తివాద రచయిత వసంత కన్నాభిరన్, మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు జీవన్‌కుమార్, సియాసత్ పత్రిక సంపాదకుడు అమీర్ అలీ ఖాన్ పాల్గొన్నారు.