హైదరాబాద్

‘బడి బాట’ పట్టాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: చదువుకునే ఈడొచ్చినా..బడి బయటున్న పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్పించేలా తల్లిదండ్రులతో పాటు విద్యాశాఖకు చెందిన అధికారులు కూడా చిత్తశుద్ధితో కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ‘బడి బాట’ కార్యక్రమంలో సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 13 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభ కానున్నందున, ఈనెల 12వ తేదీలోపు అన్ని హబిటేషన్స్ విస్త్రృతంగా పర్యటించి బడి ఈడున్న పిల్లలందర్నీ తప్పకుండా బడిలో చేర్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కలెక్టర్లు తమ విలువైన సమయంలో ఎక్కువ శాతం ‘విద్య’కు వెచ్చించి విద్యాభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వలసలు ఎక్కువయ్యాయని, దీన్ని నివారించేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా ఉండేందుకు విద్యా వాలంటీర్ల నియామకాలను నియమించే అధికారం కలెక్టర్లకే ఇచ్చామని ఆయన వివరించారు. అదే విధంగా పాఠశాలలో మరుగుదొడ్లు, మంచినీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్, కాంపౌండ్ వాల్ వంటి వౌలిక వసతులు ఉండేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలతో ఏ మాత్రం తక్కువ కావన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం అయిదు నుంచి పది శాతం వరకు అడ్మిషన్లు ఎక్కువ అయ్యేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్లు విద్యాశాఖాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, నిర్దిష్టమైన కార్యచరణ ప్రణాళికను తయారు చేయాలన్నారు. అదే విధంగా గ్రామాల్లో, బస్తీల్లో, ప్రజాప్రతినిధులు, ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసినపుడే కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. పాఠశాలలో హరితహారం కార్యక్రమం కూడా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట ఇంగ్లీషు మీడియం పాఠశాలలను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ భారతి హోళికేరి, ఇన్‌ఛార్జి ఏజేసి అశోక్‌కుమార్, డిఇవో సోమిరెడ్డి పాల్గొన్నారు.