ఐడియా

పోషకాలు పెంచే చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారెట్, బీట్‌రూట్‌లను ఉడికించిన నీటిని వృధా చేయకుండా అన్నం ఉడికించేందుకు వాడితే అన్నం రుచికరంగాను, పోషక విలువలను కలిగి వుంటుంది. అంతేకాకుండా అన్నం రంగు రెడ్ పలావ్‌లా వుంటుంది.
టమాటాలు వంటి కూరగాయలు తరిగేటప్పుడు రసం కారకుండా ముక్కలు చేయడానికి కాసేపు ఫ్రీజర్‌లో వుంచితే సరి.
ఆకు కూరలు, కూరగాయలను తరిగేటప్పుడు ముందుగా ఉప్పునీటిలో కడగాలి. అంతేకానీ తరిగిన ముక్కలను కడిగితే నీటిలో కరిగిపోయే విటమిన్లు నష్టపోతాం. అలాగేవీలైనంత పెద్ద ముక్కలుగానే తరగడం మంచిది.
సాధ్యమైనంత వరకు దుంపకూరలు, కూరగాయల పొట్టు తక్కుకవగా తీయాలి. మానవ శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు తొక్కకిందే వుంటాయని గమనించాలి.
ఆకు కూరలను వండేటప్పుడు వంట పాత్రలపై మూతలు విధిగా పెట్టాలి. ఎసరు మరిగిన తరువాతనే ఆకు కూరలు ముక్కలువేసి వుడికించాలి.
ఆకుకూరలను తరిగేటప్పుడు వాటి లేత కాడలను కూడా తరుక్కోవాలి. ఆ కాడల్లో కాల్షియం వుంటుంది.
పులియపెట్టి వండడంవల్ల పోషకాలు విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా, బి,సి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
పప్పులు త్వరగా ఉడకాలని సోడా ఉప్పు వాడతారు. దీనికి బదులు నిమ్మరసం, చింతపండు రసం వాడితే విటమిన్ బి నష్టం వాటిల్లదు.
పచ్చి కూరలను వుడకపెట్టకుండా అలాగే తినడం వల్ల పోషకాలు పుష్టిగా లభిస్తాయి. అయితే మంచినీటితో శుభ్రంగా కడిగి మాత్రమే వాడాలి.
ఆరోగ్యకరమైన పదార్ధాలను వండడం కోసం స్టీమ్ కుక్కర్, సోలార్ కుక్కర్‌లను వినియోగించాలి.
వండలు వేడిగా వున్నప్పుడే తినేయాలి. తిరిగి వేడి చేసినా పోషకాలు హఱిస్తాయి.

- హర్షిత