ఐడియా

పెదాలు తేమగా ఉండాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణం చల్లగా ఉంటే పెదాలు పగులుతుంటాయి. కాబట్టి పెదాలు తేమగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజూ మనం తాగే గ్రీన్ టీ బ్యాగ్‌ను పారేయకుండా దానిని పెదాలపై అదిమిపెట్టి ఉంచాలి. ఇలా నాలుగు నిమిషాలు పాటు చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే పెదాలు తేమగా ఉంటాయి.
కలబంద గుజ్జు పెదాలకు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పగిలిన పెదాలకు ఉపశమనాన్ని అందిస్తుంది. మంట తగ్గుతుంది. కలబంద గుజ్జులో కొంచెం పాలు కలిపి పెదాలకు రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే పెదాలు మామూలు స్థితికొస్తాయి.
చెంచా ఆలివ్ ఆయిల్ నూనెకు కొంచెం పంచదార కలపాలి. దీన్ని వేళ్లతో తీసుకుని పెదాలకు రాసి మృధువుగా రుద్దాలి. పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
టొమాటోని గుండ్రని ముక్కగా కోసి దానిపై కొన్ని చుక్కలు తేనె వేయాలి. ఆ ముక్కతో పెదాలపై ఐదు నిమిషాల పాటు రుద్ది తర్వాత నీళ్లతో శుభ్రం చేస్తే పెదాలు తాజాగా ఉంటాయి.