ఐడియా

తరచూ ఎలర్జీ వస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరానికి పడని ఆహారపదార్థాలు, మందులూ, సౌందర్యసాధనాలు వాడినా ఇలా దద్దుర్లు వస్తుంటాయి. ఇలాంటివారు వారికి ఏ కారణం వల్ల ఎలర్జీ వస్తుందో గమనించుకోవాలి. వీలైనంతవరకు అలాంటివాటిని దూరంగా ఉంచాలి. కొన్నిసార్లు ఆహారపదార్థాల్లో కలిపే రసాయనాలు కూడా కారణం కావచ్చు. కాబట్టి ఏ పదార్థం తింటే ఎలర్జీ వస్తుందో గమనించాలి. అలాంటి వాటిని తినడం మానేయాలి.
* తరచూ ఎలర్జీకి గురయ్యేవారు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
* గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
* శరీరానికి ఎక్కువ చలి లేదా ఎండ తగలకుండా జాగ్రత్తపడాలి.
* ఆహారంలో మెంతులు, మిరియాలు, నిమ్మరసం, అల్లం, పుదీనా వంటివాటిని ఎక్కువగా తీసుకోవాలి.
* ద్రవాల్లో మంచినీళ్లు, పలుచటి మజ్జిగ, కొబ్బరినీళ్లు, బార్లీ వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి కిడ్నీల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తాయి.
* రాగిపాత్రలో చింతపండు గుజ్జును రెండు, మూడు గంటలు నానబెట్టి ఉంచుకోవాలి. దద్దుర్లు వచ్చినప్పుడు ఈ గుజ్జును చర్మంపై పూతలా వేస్తే దద్దుర్లు, దురదా తగ్గుతాయి. చింతపండు గుజ్జు దద్దుర్లను తగ్గించడమే కాకుండా, శరీరంపై మరోచోట రాకుండా చేస్తుంది. దద్దుర్లు వచ్చినప్పుడు ఇది సత్వర పరిష్కారం.
* చెంచా అల్లం తరుగులో పావు చెంచా సైంధవ లవణాన్ని కలిపి పరగడుపున తీసుకుంటే ఎలర్జీలు రాకుండా ఉంటాయి.
* చల్లగా ఉన్న పదార్థాలు, ఎక్కువ వేడి ఉన్న పదార్థాలను తీసుకోకూడదు.
* వేడివేడి అన్నంలో చెంచా ఆవునెయ్యి, కొద్దిగా మిరియాలపొడి కలిపి తినాలి. ఇలా భోజనంలో మొదటి ముద్ద మిరియాలపొడితో తీసుకుంటే ఎలర్జీ క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
* వామును వేయించి పొడిచేసి దానికి సమానంగా బెల్లం పొడిని కలిపి ఉండల్లా చుట్టుకోవాలి. దీన్ని రెండు పూటలా ఒక్కొక్కటి తినాలి. ఇలా చేస్తే ఎలర్జీతో పాటు, గ్యాస్ సమస్య కూడా తగ్గిపోతుంది.
* వేడిపాలల్లో చెంచాడు పసుపు కానీ లేదా మిరియాల పొడి కానీ వేసుకుని తాగడం వల్ల కూడా ఎలర్జీ తగ్గుతుంది.
ఇలాంటి ఇంటిచిట్కాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే ఎలర్జీ సమస్య తగ్గుతుంది. సమస్య అధికంగా ఉన్నప్పుడు వైద్యుని పర్యవేక్షణ తప్పనిసరి!