ఐడియా

దోసెల పిండి పులిసిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో దోసెలకు ఏమేర డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే.. బియ్యపు పిండితో తయారయ్యే ఈ దోసెల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషక విలువలు ఉండటంతో పాటు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. ఇక వండటం కూడా సులభమే కాబట్టి.. చాలావరకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో దీనే్న తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇక ఇళ్లల్లో అయితే మూడురోజులకు సరిపడా పిండిని తయారుచేసుకుని పెట్టుకుంటారు. అయితే మొదటిరోజు వరకు పిండి బాగానే ఉంటుంది కానీ.. రెండో రోజు వచ్చేసరికి కాస్త పులుపుగా, రంగు కూడా మారినట్లు అనిపిస్తుంది. ఇది అందరి ఇళ్లలోనూ ఎదురయ్యే సమస్యే. ఎందుకంటే.. దీన్ని ఒకరోజు ముందే తయారుచేయడంతో పాటు రెండు రోజులు నిల్వ ఉంచడంతో ఇలాంటి మార్పులే సంభవిస్తాయి. మరి దోసెల పిండి పులుపెక్కినప్పుడు ఏం చేయాలంటే.. ఒక భాగం పిండికి పావు భాగం రవ్వతో ఉల్లిపాయ, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేసి దోసెపిండిలో కలుపుకోవాలి. దీన్ని బాగా కలిపిన తరువాత దోసెలు వేసుకుంటే పుల్లగా అనిపించవు. చాలా రుచిగా ఉంటాయి.