ఐడియా

బ్రెడ్‌తో జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం అల్పాహారంగా చాలామంది బ్రెడ్ స్లైసులను తినడం చాలామందికి అలవాటు. ఇది మంచిది కాదంటున్నారు పరిశోధకులు. ఆధునిక ఆహారశైలి కారణంగా ఉదర సంబంధ సమస్యలతో పాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్రెడ్, పాస్తాలాంటివి ఎక్కువగా తీసుకునేవారిలో మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు వారు. దీనికి కారణం బ్రెడ్‌లో గ్లుటేన్ ఎక్కువ అని వారు స్పష్టం చేస్తున్నారు. ఇది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వారు చెబుతున్నారు. అయితే ఇది అందరి విషయంలో జరగకపోవచ్చని, కొందరిపై మాత్రం ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. బ్రెడ్ తిన్న తరువాత పళ్ళు తీసుకుంటే కొంతవరకూ సమస్య నుంచి తప్పించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.