ఐడియా

ఆకుకూరల్లో దండిగా పోషకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌకగా లభించే ఆకుకూరల్లోని పోకాలను పదిలం చేసుకుంటేనే ప్రయోజనం. మనం తీసుకునే ఆహారంలో పచ్చటి ఆకుకూర తప్పని సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. వాటిని వండుకునేటపడు, నిల్వచేసుకునేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పోషకాలు పోకుండా తినవచ్చు. ఆకుకూరలను సూర్యరశ్మి తగలని ప్రదేశంలో ఉంచాలి. సూర్యరశ్మి తగిలితే ఆకుకూరల్లో వుండే కెరోటిన్ అనే పోషక పదార్థాలు నశిస్తాయి. వండటానికి ముందు శుభ్రంగా కడగాలి. ఆకులపైన జల్లిన మందు వాసన పోవడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ఆకులను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగిగానీ అసలు తరగకుండా గానీ వండుకోవడం మంచిది. ఎప్పుడూ తాజాగా వుండే ఆకుకూరలనే వండుకోవాలి. నిలువ వుంచిన కొద్దీ వాటిల్లో పోషక పదార్థాలన్నీ తగ్గుతాయి.
ఆకుకూరలు వేయించి తినకూడదు. ఖనిజాలు, విటమిన్‌లు పోయి పిప్పి మిగులుతుంది. క్యారెట్, ముల్లంగి లాంటి దుంప కూరలతోబాటు వాటికుండే ఆకులను కూడా వండుకొని తింటే మరికొన్ని పోషకాలు దక్కుతాయి.
ఆకుకూరల్లోని శక్తి ఎంత వుందో చెప్పలేం. తోటకూరలో 50వేల కేలరీల శక్తి లభిస్తుంది. బి1, బి2 విటమిన్లు కూడా ఎక్కువగా ఉండటమే కాకుండా కంటిచూపును తోటకూర ఎంతో ఉపయోగపటడుతుంది. బచ్చలికూరలో 66 శాతం ఇనుము వుంటుంది. శరీరానికి ఇది చలువను, శక్తిని అందిస్తుంది. మొలలు వంటి వ్యాధులను అరికడుతుంది. కొత్తిమీర రక్తవృద్ధిని, జీర్ణవృద్ధిని, ఆకలిని పెంచుతుంది.
కరివేపాకు కేన్సర్‌ని నివారిస్తుంది. గోంగూర దగ్గు, ఆయాసం, తు మ్ములు, జలుబుకు మంచి మందులా పనిచేస్తుంది. కాల్షియం లభ్యమై రక్తహీనతను పో గొడుతుంది.
అవిశె కూరలోని ఐరన్ గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. మూత్రాశయాల్లోని రాళ్ళు కరిగించే శక్తి ఈ ఆకుకూరకు వుంది.
పుదీనా ఆకు నోటి దుర్వాసనను, నోటిలోని పుండ్లను నివారిస్తుంది. దీని వాసనకు క్రిములు దూరవౌతాయి.

-బి.విజయలక్ష్మి