ఐడియా

అలెర్జీలు వస్తే ఏం చేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలెర్జీ సమస్యలు కనిపిస్తే ఇమ్యునాలిజస్టు లేదా ఎండీని సంప్రదించాలి. కుటుంబ ఆరోగ్య చరిత్ర, శారీరక పరిశీలన, చర్మ పరీక్ష, రక్తపరీక్షల ద్వారా వైద్యులు అలెర్జీ కారకాలను గుర్తిస్తారు. తర్వాత దాన్ని కంట్రోల్ చేసేందుకు ట్రీట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తారు. ఇంజెక్షన్లు, టాబ్‌లెట్లు సూచించవచ్చు. యాంటీ హిస్టామిన్స్, నాసల్ యాంటీ హిస్టామిన్స్, నాసల్ కార్టికోస్టెరాయిడ్ డ్రాప్స్, ఆస్తమాలో ఇన్‌హేలర్స్, ఓరల్ స్టెరాయిడ్స్ ఇలా మందులు సూచిస్తారు. ఇవి కూడా దీర్ఘకాలంపాటు వాడాల్సి వుంటుంది. దాదాపు చాలా రకాల అలెర్జీలకి శాశ్వత నిర్మూలన లేదు. వాటిని అదుపు చేయడం వరకే చికిత్స. అలెర్జీలకు సమర్ధవంతమైన చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతునే వున్నాయి. కానీ ఇంతవరకు వాటిని పూర్తిగా నిర్మూలించే సమర్ధవంతమైన చికిత్సలు సాధ్యం కాలేదు. పిల్లల్లో ఆహారం మందుల పరంగా వున్న అలెర్జీలు తర్వాత కాలంలో వాటంతట అవే కనుమరుగు అయ్యే అవకాశం ఉంటుంది.
ఎవరికి రిస్క్
అలెర్జీలు ఏ వయసులోనైనా రావచ్చు. ఆహార పరమైన అలెర్జీలు మాత్రం చిన్న వయసులోనే మొదలవుతాయి. కుటుంబ చరిత్ర, జెనెటిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. తల్లిదండ్రులకు అలెర్జీలు వుంటే పిల్లలకు అవి రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. సహజంగా జన్మించడం కాకుండా, సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లలకు అలెర్జీల రిస్క్ ఎక్కువగా వుంటుంది.
నివారణ
పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి. ఇది ఈరోజు దాదాపు అసాధ్యం. ఇంట్లో వుండే డస్ట్‌మైట్స్ వల్ల అలెర్జీలు వస్తుంటే తేమ తక్కువ వుండేలా చూసుకోవడంతోపాటు వారానికోసారి బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్, బ్లాంకెట్లను వేడినీటితో వాష్ చేయాలి. ఇంట్లో పెంపుడు జంతువుల కారణంగా అలెర్జీలు వస్తుంటే వాటిని ఇంట్లో లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంట్లో పీల్చే వాయువును స్వచ్ఛంగా మార్చేందుకు ఎయిర్ ప్యూరిఫయర్లు మార్కెట్లో వున్నాయి. వాటిని వాడుకోవడం వల్ల ఉపయోగం వుంటుంది. చల్లటి గాలి కారణంగా అలెర్జిక్ రైనైటిస్, సైనసైటిస్ సమస్యలు వస్తుంటే ముక్కుకు వస్త్రం ధరించడం వల్ల ఉపయోగం వుంటుంది. గాలిలో తేమ ఎక్కువగా వున్నప్పుడు అలెర్జిక్ రైనైటిస్, సైనసైటిస్ సమస్యలు రావచ్చు. ఇలాంటి సమయాల్లో ఇంట్లో రూమ్ హీటర్స్ వాడడం మంచిది.