ఐడియా

చలికాలంలో ఇలా చేయండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలంలో చర్మం పొడిబారి పోతుంది. పగుళ్లు రావటంతో అసౌకర్యంగా ఉంటుంది. ఈ కాలంలో చర్మాన్ని సంరక్షించుకోవటానికి సులువైన పద్ధతులేమిటో తెలుసుకుందాం..
గ్లిజరిన్ చర్మ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో పొడిచర్మం బారిన పడకుండా ఉండాలంటే గ్లిజరిన్ వాడటం మంచిది.
రెండు కోడిగుడ్ల పచ్చసొనను ఒకబౌల్‌లో తీసుకుని అందులోకి రెండు చుక్కల ఆలివ్‌నూనెను కలపాలి. ఆ రెండింటినీ మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఇరువై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలాంటి ఫేస్‌ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వాడితే మంచి ప్రయోజనం.
చలికాలంలో చేతులు, కాళ్లు, పెదాల దగ్గర చర్మం పొడిబారిపోతుంది. చర్మం అందవిహీనంగా కనిపిస్తుంది. దీన్ని అరికట్టాలంటే పెట్రోలియం జెల్లీ చక్కగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు దీన్ని వాడితే మంచిది.
ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకుని ముఖానికి బాగా రుద్ది ఇరవై నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా, శుభ్రంగా ఉంటుంది.
కొంచెం దూది తీసుకుని మరిగిన పాలలో ముంచి ముఖంపై తుడిస్తే కంటికి కనిపించని దుమ్ము, దూళిని తీసేస్తోంది. ముఖం శుభ్రం అవుతుంది.
క్యారెట్‌ను పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుని ఒక గంట తర్వాత స్నానం చేస్తే ముఖం నిగనిగలాడుతోంది.
నారింజ పండు తొక్కతీసి ఎండబెట్టి గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్‌ను పచ్చిపాలలో కలిపి ఒళ్లంతా రాసుకోవాలి. కొంతసేపటి తరువాత స్నానం చేస్తే చర్మం నల్లరంగు పోయి కొత్త రంగును సంతరించుకుంటుంది.
ఒక బౌల్‌లో టేబుల్ స్పూన్ బాదం పొడిని తీసుకుని దానికి రెండు టేబుల్ స్పూన్ల క్రీమ్‌మిల్క్‌ను కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని చర్మానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే పొడిబారిన చర్మం మృదువుగా తయారవుతుంది.
అరగ్లాసు వేడిపాలలో కాస్త పసుపు, అల్లం ముక్క వేసుకుని తాగితే అలర్జీల నుంచి ఉపశమనం లభిస్తోంది.
చలికాలంలో పాలమీగడను రాసుకుని కాసేపు అలాగే ఉంచుకుని స్నానం చేస్తే మంచిది.
పండిన బొప్పాయి గుజ్జును ఒక బౌల్‌లో తీసుకుని దానికి అరటిపండును కలిపి చూర్ణం చేసుకోవాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల తేనెను కలిపి మిక్స్ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని చర్మానికి రాస్తే ముఖవర్చస్సు పెరుగుతుంది.

జింక్ లోపిస్తే అలసటే!

మనిషికి జింక్ ఎంతో అవసరం. గర్భిణీగా ఉన్నప్పటి నుంచే జింక్ ధాతువును అందిస్తారు. ప్రతిఒక్కరూ రోజుకు కనీసం 15 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. ఆహారపదార్థాల ద్వారానే అవసరమైన జింక్‌ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. టాబ్లెట్స్ రూపంలో తీసుకునే బదులు జింక్ ఎక్కువగా ఉండే పళ్ళు, పప్పు దినుసులు, ఆకు కూరలు, పాలు, క్యాబేజీ, బంగాళాదుంప, బీట్‌రూట్, వేరుశనగలు ప్రతిరోజూ ఆహారంలో తీసుకుంటే చాలు. జింక్ లోపం వల్ల మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు. పిల్లల్లో ఎదుగుదల లోపిస్తోంది. పిల్లల్లోకానీ, పెద్దలలో కానీ జింక్ లోపం ఏర్పడితే చర్మం మృధుత్వాన్ని కోల్పోయి బిరుసవుతుంది. ఆకలి తగ్గిపోయి, ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. దీనివల్ల వారికి నీరసం, పనిచేస్తుంటే అలసట ఏర్పడతాయి. గర్భిణీలకు, పాలిచ్చే బాలింతలకు మిగిలినవారి కంటే కొంతశాతం జింక్ అవసరం ఎక్కువ. కండరాలకు, కాలేయానికి, కంటి చూపునకు తోడ్పడే జింక్ అవసరం ఎంతైనా ఉంది