ఐడియా

తోటకూర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకుకూరల్లో అందరూ ఇష్టపడేది, ఆహార పదార్థాల్లో తరచూ చేర్చేది తోటకూర. దీనితో ఎన్నో రకాలైన ఆహార పదార్థాలను తయారుచేస్తారు. ఇందులో శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. తోటకూరలో ఎన్నో రకాలున్నాయి. పెరుగు తోటకూర, కొయ్య తోటకూర, ఎర్ర తోటకూర, ముళ్ల తోటకూర వంటివి మార్కెట్‌లో లభిస్తాయ. చాలామంది పెరుగు తోటకూర, కొయ్య తోటకూర, ఎర్ర తోటకూరను వంటకాల్లో వాడతారు. తోటకూరతో చేసే వడలు, పకోడీలు రుచికరంగా ఉంటాయ. మజ్జిగ పులుసులోనూ దీన్ని వేస్తారు. ఐరన్, కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, నియాసిన్, స్వల్పశాతంలో కొవ్వు, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఎ, బి, బి12, సిలు తోటకూరలో లభిస్తాయి. ఆహార పదార్థంగానే కాక వైద్య పరంగా కూడా ఇది ఉపయోగిస్తుంది.
- మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
- చలువ చేస్తుంది. తోటకూర కషాయాన్ని పిల్లలచేత తాగిస్తే కడుపులో నులిపురుగుల సమస్య తొలగిపోతుంది.
-జిగట విరేచనాలు తగ్గిపోతాయి. రక్తవృద్ధి కలుగుతుంది.
- కంటిచూపును, కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది. విరేచనం సాఫీగా అయ్యేలా చూస్తుంది.

- కె.నిర్మల