ఐడియా

ఖాళీ సీసాలతో మూత్రశాలలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* విద్యార్థుల సృజనకు నీరాజనం
* బహుమతుల వెల్లువ

సమస్యలేని ప్రాంతం ఉండదు. పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. కావలసిందల్లా సమస్యను ఎదుర్కోవడం, పరిష్కారం ఆలోచించడం, దానిని అమలు చేయడం. అప్పుడు విజయం ఖాయం. అదే నిరూపించారు. తమిళనాడుకు చెందిన ఐదుగురు విద్యార్థులు. పెద్దపెద్దవారికీ తట్టని ఓ ఆలోచన వారిని హీరోలను చేసింది. తిరుచిరాపల్లి జిల్లాలోని కురుంబపట్టి పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారిపోయింది వారివల్లే. ఇంతకీ వారేం చేశారో తెలుసా!
***
బడికి వెళ్లొచ్చాక ఎందుకు ఇలా రోగాలొస్తున్నాయ్!
ఎన్నడూ లేని రొంప, జ్వరం, ఒళ్లు నొప్పులు ఎలా వస్తున్నాయ్..
ఇదే ఆలోచన కొందరికి వచ్చింది. అదే స్కూలులో చదువుతున్న పదమూడేళ్ల పిల్లలు వాళ్లంతా. ఆలోచించారు. అనే్వషించారు. చివరకు కారణమేంటో కనిపెట్టారు. స్కూలులో సరైన మూత్రశాలలు లేకపోవడం, అంతా ఒకేచోట చేరి కాలకృత్యాలు తీర్చుకోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, నిర్వహణ లోపంవల్ల ఒకరినుంచి మరొకరికి రోగాలు సోకుతున్నాయని తెలిసిందివారికి. సరే పరిష్కారం ఏమిటి, ఎలా మళ్లీ బుర్రకు పనిచెప్పారు. ఆర్థిక స్తోమతలేని పాఠశాల యాజమాన్యం మరుగుదొడ్ల నిర్మాణానికి చేతులెత్తేసింది. ఇక పిల్లలే ఆలోచించారు. తళుక్కున ఓ ఐడియా తట్టింది. వాడేసి వదిలేసిన పనికిరాని వాటర్‌క్యాన్స్‌ను యూరినల్స్‌గాను, మూత్రం బయటకు వెళ్లడానికి గొట్టాలుగానూ తయారు చేశారు. పెద్దగా ఖర్చులేని ఈ తరహా ప్రయోగం అందరికీ నచ్చింది. సత్ఫలితాలనూ ఇచ్చింది. పనికిరాని రేకులు, ఖాళీ సీసాలు, వాటర్‌క్యాన్స్‌నే ఉపయోగించి మూత్రశాల నిర్మించి, కాస్తంత శుభ్రంగా ఉండేలా నిర్వహిస్తూ ఔరా అనిపించారు.
ఉపాధ్యాయుడే స్ఫూర్తి
పదమూడేళ్ల లోపు విద్యార్థులు సుపిక్ పాండ్యన్, రాగుల్, ప్రభారన్, దయానిధి, సంతోష్‌లకు ఈ ఆలోచన వచ్చింది. 20 లీటర్ల వాటర్ క్యాన్‌లనే బేసిన్‌లుగా చేయాలనుకున్నారు. మూత్రం పోశాక బయటకు వెళ్లిపోయేందుకు ఖాళీ వాటర్ బాటిల్స్ వాడాలనుకున్నారు. ఆలోచనైతే వచ్చింది. దీనికి ‘సేఫ్ మోడ్ పిస్సింగ్ సిస్టమ్’ అని పేరుకూడా పెట్టారు. ఒక్కో మూత్రశాలకు ఆరు వందల రూపాయలకు మించి ఖర్చు పెట్టకూడదన్నది నిబంధన. వారికి గురువు తోడయ్యాడు. డి.కేశవన్ అనే ఉపాధ్యాయుడు వారికి దిశానిర్దేశం చేశాడు. ఇక వారికి తిరుగులేకుండాపోయింది. ఆలోచనను ఆచరణలో నిరూపించారు. సమస్యను పరిష్కరించి అందరి మన్నన పొందారు. అక్కడితో ఆగకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఇలాంటి సమస్యలున్న ప్రాంతాలవారికి తమ ప్రయోగం గురించి వివరించి అక్కడా మంచిమార్పులు తీసుకువచ్చారు. డిజైన్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన పోటీల్లో వీరికి ‘బోల్డెస్ట్ ఐడియా’ అవార్డును తెచ్చిపెట్టింది. దాంతోపాటు 50వేల రూపాయల నగదు బహుమతి అందింది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netఆకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03