ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాది పొడవునా అందరికీ అందుబాటులో ఉండే వేపాకులు పలు అనారోగ్యాలను అరికట్టేందుకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్యంలో విశిష్ఠస్థానం ఉన్న వేపాకులు చర్మ సంరక్షణకు ఎంతగానో దోహదపడతాయి. విటమిన్-సి పుష్కలంగా ఉన్నందున వేపాకులను ముద్దగా చేసుకుని శరీరానికి రాసుకుంటే చర్మంపై నల్లమచ్చలు, ముడతలు వంటివి సమసిపోతాయి. చర్మం మృదుతాన్ని సంతరించుకుని కాంతులీనుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలోనూ వేపలోని ఔషధగుణాలు ఉపయోగపడతాయి. వేపాకులను తరచూ తింటే శరీరంలో సుగర్ స్థాయి అదుపులో ఉంటుంది. ఫలితంగా మధుమేహం తగ్గుముఖం పడుతుంది. మధుమేహ రోగులు లేత వేపాకులను నమిలి రసాన్ని మింగుతుంటే శరీర వ్యవస్థలో సుగర్ స్థాయిని నియంత్రించుకోవచ్చు. ఇందులోని పీచు పదార్థం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అజీర్తి, కడుపులో గ్యాస్ వంటి సమస్యలతో సతమతమయ్యేవారు తరచూ వేపాకులను తినడం ఉత్తమం. దగ్గు, శ్వాస సంబంధ ఇబ్బందులు, ఆస్త్మా వంటి అనారోగ్యాలను కూడా వేపాకులను తినడం వల్ల నివారించవచ్చు. వేపపుల్లలతో నిత్యం పండ్లు తోముకుంటే ఎలాంటి దంత సంబంధ సమస్యలూ దరిచేరవు. దంతాలపై, నోట్లో ఉండే క్రిములు బయటకు పోతాయి. దంతాలకు మేలు చేసే గుణం ఉన్నందునే నేడు టూత్‌పేస్టుల తయారీలో వేపను వినియోగిస్తున్నారు.