ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు చిన్న చిట్కాలు పాటించి గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వచ్చేలా చేస్తుంటారు. వారి తెలివితేటలకు అద్దం పట్టే రుూ చిట్కాలు మీరూ ఆచరించండి. వంట ఏం చేయాలో నిర్ణయించుకొని అందుకు అవసరమయ్యే వంట సామగ్రిని సిద్ధంగా వుంచుకొని ముందు చిన్న బర్నర్‌తో వంట చేయటం వలన పెద్ద బర్నర్ మీద వండే పదార్థాలకయ్యే గ్యాస్‌కన్నా పది శాతం తక్కువ ఖర్చుఅవుతుంది. ఐఎస్‌ఐ మార్కు కలిగిన ప్రెషర్ కుక్కర్‌లను వాడటంవల్ల అన్నం, పప్పు, కూరలు వంటివి ఒకేసారి వండటంవలన గ్యాస్ ఆదా అవుతుంది. వంట పాత్రలమీద మూతలు వుంచటం, విశాలమైన లోతు తక్కువ వున్న పాత్రలు వాడటం, అవసరమైన వరకే నీటిని వాడటం లేదంటే నీళ్ళు ఎక్కువగా పోస్తే అదనంగా గ్యాస్ ఖర్చు అవుతుంది. బర్నర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయటం, నీలిరంగు మంట వస్తుందో లేదో చూసుకోవటం, ఐఎస్‌ఐ మార్కు స్టవ్‌లే వాడటం వంటి సూచనలు పాటిస్తే గ్యాస్ చాలా ఆదా అవుతుంది. వంట పూర్తయిన వెంటనే నాబ్‌తోపాటు రెగ్యులేటర్ కూడా ఆఫ్ చేయాలి. రెగ్యులేటర్ అమర్చి లేనపుడు అలాగే సిలిండర్ లీకవుతున్నపుడు సిలిండర్ వాల్వ్‌పైన వెంటనే సెక్యూరిటీ క్యాప్ అమర్చటం మర్చిపోకూడదు. గ్యాస్ సిలిండర్‌ను ఎప్పుడు నిలువుగానే వుంచాలి. గాలికంటే గ్యాస్ బరువైనది కనుక నేల మట్టం వద్ద గాలి ప్రసరణం వుండటం చాలా అవసరం. గ్యాస్ లీకయి వాసన వస్తుంటే వెంటనే గ్యాస్ పొయ్యిని ఇంకా దగ్గరలో వున్న దీపాలు, జ్యోతులు, అగరువత్తులతో సహా అన్ని మంటలను ఆర్పివేయాలి. గది తలుపులు, కిటికీలు తెరవాలి.

-కాకరపర్తి