ఐడియా

మైగ్రేన్ ఇలా మటుమాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగువను నీళ్లలో అరగదీయగా వచ్చిన ద్రవాన్ని పార్శ్వపునొప్పి ఉన్న వైపు ముక్కులో రెండు చుక్కలు వెయ్యాలి.
తమలపాకులకు నూనెరాసి బాగా వెచ్చచేసి కణతలపై ఉంచితే తలనొప్పులు, పార్శ్వపు నొప్పులు తగ్గుతాయి.
రోజుకు మూడుసార్లు కొబ్బరి నీరు త్రాగితే పార్శ్వపు నొప్పులు వాంతులు తగ్గుతాయి.
శొంఠిని అరగదీసి కణతలకు, నుదుటికి పట్టించాలి.
సముద్ర పాల వేరు పొడిని గంజితో కలిపి తీసుకోవాలి.
హరి జాత ఆకుల చిక్కని కషాయం ఒక పావుగ్లాసు త్రాగాలి.
అక్కల కఱ్ఱ వేరు గంధం కణతలకు పట్టించాలి.
అల్లపు రసంలో బెల్లం కలిపి 3 చుక్కలు ముక్కులో వేసి పీల్చాలి.
పార్శ్వపునొప్పికి మంచిమందు దానిమ్మ.
మామిడి చెట్టు బెరడు నీళ్ళతో మెత్తగా నూరి కణతలకు పట్టువెయ్యాలి.
ఉప్పు, శొంఠి, గంధం పొడి సమ భాగాలుగా తీసికొని నీళ్లతో నూరి కణతలపై పూయాలి.
పాలకోవా/కలకండ సూర్యోదయానికి ముందు రెండు చెమ్మలు పరగడుపున తీసుకోవాలి.
మెంతులను, పెరుగులో నానబెట్టి తెల్లవారుకట్ల పెరుగుతో సహా త్రాగాలి.
ముసాంబరం 500 మి.గ్రా.లు ఒక అగాము తేనెలో కలిపి రెండు పూటలా తింటే మంచి ఉపశమనం.
ధనియాలు, జీలకఱ్ఱ, శొంఠి సమంగా తీసికొని పొడి చెయ్యాలి. తగినంత ఉప్పు కలపాలి. ఒక పెద్ద గ్లాసు మజ్జిగలో ఒక చెంచా పొడి కలిపి త్రాగితే మైగ్రేన్‌తో వికారం కూడా తగ్గుతుంది.
కచ్చూరం అరగదీయగా వచ్చిన గంధం తేనెతో కలిపి తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది.
తమలపాకుపై నూనె పూసి కణతలపై వెయ్యాలి.
ద్రాక్షపళ్ళు/రసం మైగ్రేన్‌కు మంచి ఉపశమనం
మరికొన్ని మంచి పద్ధతులు
మిరియాలు అరగదీసి కణతలకు పట్టిస్తే కణతల నొప్పి తగ్గుతుంది.
లవంగలాను పేస్ట్‌లా చేసి కణతలకు పట్టిస్తే మంచి రిలీఫ్
ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక కప్పు మరిగే నీటిలో వెయ్యాలి. రెండు నిమిషాల తరువాత వడ కట్టి చల్లార్చి తాగితే జలుబుతో కూడిన తలభారం తగ్గును.
దాల్చిన చెక్కను నీటిలో అరగదీయగా వచ్చిన గంధమును కణతలమీద రాస్తే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- గురునాధరాజు