ఐడియా

ఐడియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారానికి రెండుసార్లు చొప్పున నెలరోజుల పాటు పది మందారపూలు, 20 కరివేపాకులు, కొద్దిగా పాలు కలిపి రుబ్బి, మూడు స్పూన్ల తేనె, ఒక గుడ్డుసొన కలిపి తలకు పట్టించి 40 నిమిషాలాగి తలస్నానం చేస్తే జుట్టురాలడం తగ్గుతుంది.
రెండు టీ స్పూన్లు ఆముదం, ఒక స్పూన్ గ్లిజరిన్, గుడ్డులోని తెల్లసొన కలిపి ఈ మిశ్రమాన్ని తడిజుట్టుకు మసాజ్ చేసి కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.
కొబ్బరి, బాదం నూనెల్ని సమపాళ్ళలో కలిపి అరచెంచా కళ్లకింద, పెదవుల కింద మసాజ్ చేసి ఇరవై నిమిషాలాగి పాలతో కడిగేస్తుంటే కంటికింద పెదవుల చుట్టూ ఉన్న నలుపు తగ్గుతుంది.
రోజుమార్చి రోజు మోచేతులు, మోకాళ్లపై తాజా మీగడ రాసి, నిమ్మచెక్క తీసుకుని, ఒక టీ స్పూన్ పంచదార జల్లి, పంచదార కరిగేవరకు స్కృబ్ చేస్తుంటే చలికాలంలో చర్మం మృదువుగా ఉంటుంది.
పచ్చి కాకరకాయల రసాన్ని తేనె, ఉప్పు, కొద్దిగా నీరు కలిపి బాగా రుబ్బి ఆరెంజ్ పీల్ పొడి కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్ వేస్తే చర్మం కాంతులీనుతుంది.
ముఖంపై ముడతలు పోవాలంటే ముందు ముఖాన్ని సోపుతోగానీ, సున్నిపిండితోగానీ కడిగిన తరువాత బొప్పాయి లేదా అరటిపండు గుజ్జు రాసి మర్దన చేయాలి. తరువాత మినపప్పు పొడి రెండు స్పూన్లు, బార్లీ గింజల పొడి రెండు స్పూన్లు తోటకూర రసంలో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ము ఖం మీద ఏర్పడ్డ ము డతలు పోతాయి.